Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145594
            [news_title_telugu_html] => 

అది భారత్ అంతర్గత వ్యవహారం: బంగ్లాదేశ్

[news_title_telugu] => అది భారత్ అంతర్గత వ్యవహారం: బంగ్లాదేశ్ [news_title_english] => scrapping art 370 indias internal matter bangladesh [news_short_description] => జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా ఏ కోశానా మద్దతు లభించడం లేదు. [news_tags_keywords] => bangladesh,article 370,India [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 15:52:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అది భారత్ అంతర్గత వ్యవహారం: బంగ్లాదేశ్ - scrapping art 370 indias internal matter bangladesh - EENADU
close

తాజా వార్తలు

అది భారత్ అంతర్గత వ్యవహారం: బంగ్లాదేశ్

జమ్ముకశ్మీర్‌ అంశంపై మన దేశానికి మద్దతు

 

ఢాకా: జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా ఏ కోశానా మద్దతు లభించడం లేదు. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్‌ కూడా భారత్‌ వైపే మొగ్గు చూపింది. ఇది భారత ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని వెల్లడించింది. ‘ఆర్టికల్ 370 రద్దును భారత ప్రభుత్వ అంతర్గత వ్యవహారంగా బంగ్లాదేశ్ పరిగణిస్తోంది’ అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దేశం ప్రాంతీయ సుస్థిరత, శాంతిని నెలకొల్పుట, అన్ని దేశాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని దానిలో పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ కశ్మీర్ అంశం గురించి బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాకు వివరించిన మరుసటి రోజే ఆ దేశం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. కశ్మీర్ అంశంపై భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టాలనుకుంటున్న పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ ప్రకటన గట్టి ఎదురు దెబ్బే. ఇప్పటికే యూఎస్‌, రష్యా, ఫ్రాన్స్‌ వంటి దేశాలు దీన్ని ద్వైపాక్షిక అంశమంటూ పాక్‌ వాదనలకు మద్దతు ఇవ్వడం లేదు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.