Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145653
            [news_title_telugu_html] => 

చిదంబరానికి సుప్రీంలో మళ్లీ నిరాశ

[news_title_telugu] => చిదంబరానికి సుప్రీంలో మళ్లీ నిరాశ [news_title_english] => supreme court likely to hear chidambaram plea on firday [news_short_description] => కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో..... [news_tags_keywords] => Chidambaram,Congress,Supremecourt,INX media case [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 17:45:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చిదంబరానికి సుప్రీంలో మళ్లీ నిరాశ - supreme court likely to hear chidambaram plea on firday - EENADU
close

తాజా వార్తలు

చిదంబరానికి సుప్రీంలో మళ్లీ నిరాశ

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన ముందస్తు బెయిల్‌ కోసం చేసుకున్న పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ పిటిషన్‌పై  శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు, సీబీఐ అధికారులు చిదరంబరానికి లుక్‌ అవుట్‌ నోటీసులు జారీచేశారు. ఆయన అరెస్టుకు రంగం సిద్ధంచేసిన అధికారులు.. చిదంబరం కోసం గాలిస్తున్నట్టు సమాచారం. నిన్న దిల్లీ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను నిరాకరించినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. సీబీఐ అధికారుల బృందం ఆయన ఇంటికి వెళ్లినప్పుడు చిదంబరం లేకపోవడంతో వెనుదిరిగింది. 

మనీలాండరింగ్‌లో ఇదో తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. కానీ చిదంబరం ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారని పేర్కొంది. దీనిపై చిదంబరం తరఫున కపిల్‌ సిబల్ స్పందిస్తూ.. ఈ కేసు విచారణకు న్యాయస్థానంలో హాజరయ్యేందుకు చిదంబరం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే, ఈ పిటిషన్‌పై తక్షణమే విచారించలేమని జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ రోజు ఉదయం తెలిపారు. అనంతరం ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ వద్దకు పంపారు. అయితే, ఆయన అయోధ్యపై కేసు విచారణలో ఉండటం, చిదంబరం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉండటంతో పిటిషన్‌ ఈ రోజు విచారణకు రాలేదని తెలుస్తోంది.   

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న చిదంబరం దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు నిన్న కొట్టివేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా ఉపశమనం లభించలేదు. ఈ పిటిషన్‌పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం సుముఖత చూపలేదు. బుధవారం ఉదయం దీన్ని దాఖలు చేయాలని సూచించింది. దీంతో బుధవారం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారణకు వచ్చేలా కపిల్‌ సిబల్‌ నేతృత్వంలోని న్యాయ బృందం పలుమార్లు ప్రయత్నాలు చేసినా ఈ రోజు విచారణకు రాలేదు.  

చిదంబరానికి సొంత పార్టీ మద్దతు
చిదంబరానికి కాంగ్రెస్‌ నుంచి మద్దతు లభించింది. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ చిదంబరానికి అండగా నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వం చిదంబరంను లక్ష్యంగా చేసుకొందని.. అందుకు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను పావులుగా వాడుకుంటోందని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి మోదీ ప్రభుత్వం పాల్పడుతోందని మండిపడుతున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.