Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146056
            [news_title_telugu_html] => 

చిదంబరాన్ని విచారిస్తున్న సీబీఐ

[news_title_telugu] => చిదంబరాన్ని విచారిస్తున్న సీబీఐ [news_title_english] => In 2nd Round of Interrogation CBI Quizzes Chidambaram [news_short_description] => ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత పి. చిదంబరం విచారణ మొదలైంది. నిన్న ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే......... [news_tags_keywords] => Chidambaram ,CBI,INX media case [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => He_RnPumHfE [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 10:13:53 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చిదంబరాన్ని విచారిస్తున్న సీబీఐ - In 2nd Round of Interrogation CBI Quizzes Chidambaram - EENADU
close

తాజా వార్తలు

చిదంబరాన్ని విచారిస్తున్న సీబీఐ

దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరంను అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయనను కొందరు సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఆయనను ఉంచారు. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే మొదటి రౌండ్‌ పూర్తయింది. రెండో రౌండ్‌ కూడా మొదలైంది. ఇందులో భాగంగా ఇంద్రాణీ ముఖర్జీ పాత్రపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోర్టులో విచారణ పూర్తయిన అనంతరం ఆయన రిమాండ్‌కు సీబీఐ విజ్ఞప్తి చేయనుంది.

తాను ప్రారంభించిన భవనంలోనే  విచారణకు..!

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరంను దిల్లీలోని సీబీఐ నూతన ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం చిదంబరం అతిథిగా వచ్చి ఆ భవనాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఆయన హోంశాఖా మంత్రి హోదాలో ఈ భవనాన్ని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో కలిసి ప్రారంభించారు.  2011 జూన్‌ 30న జరిగిన ఆ కార్యక్రమంలో ఆయనతో పాటు అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌ సిబల్‌, మరో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ  కూడా పాల్గొన్నారు. ఇప్పుడు చిదంబరాన్ని అదే భవనంలో విచారిస్తుండటం గమనార్హం. మరోవైపు ఈ ప్రాంతం వద్ద భద్రతను మరింత పెంచారు. చిదంబరం అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనలు చేపడుతుండటంతో విచారణకు విఘాతం కలగకుండా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.