Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146073
            [news_title_telugu_html] => 

చిదంబరం లొంగిపోవాల్సింది: సత్యపాల్‌ సింగ్‌

[news_title_telugu] => చిదంబరం లొంగిపోవాల్సింది: సత్యపాల్‌ సింగ్‌ [news_title_english] => BJP MP Satya Pal Singh said that Chidambaram is an intellectual and knows the law [news_short_description] => మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరానికి  భాజపా ఎంపీ సత్య పాల్ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశరాజకీయాల్లో ఆయన ఎన్నో బాధ్యతలు చేపట్టారని, ఇప్పుడు ... [news_tags_keywords] => Satya Pal Singh, Chidambaram ,INX Media case [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 11:10:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చిదంబరం లొంగిపోవాల్సింది: సత్యపాల్‌ సింగ్‌ - BJP MP Satya Pal Singh said that Chidambaram is an intellectual and knows the law - EENADU
close

తాజా వార్తలు

చిదంబరం లొంగిపోవాల్సింది: సత్యపాల్‌ సింగ్‌

దిల్లీ: మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంపై  భాజపా ఎంపీ సత్యపాల్ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశరాజకీయాల్లో ఆయన ఎన్నో బాధ్యతలు చేపట్టారని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను నమ్మలేకపోతున్నానన్నారు. గురవారం ఈయన మీడియాతో మాట్లాడారు.

‘కేంద్ర హోం మంత్రిగా, ఆర్థిక మంత్రిగా చిదంబరం ఎంతో సేవ చేశారు. ఆయన తెలివైన వారు, మేధావి. చట్టం, న్యాయం గురించి తెలిసిన వ్యక్తి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను నమ్మలేకపోతున్నాను. కానీ, కోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత ఆయన అలా చేసి ఉండకూడదు. ఇప్పుడేం జరుగుతుందో ఆయనకది మంచిది కాదు. కోర్టు ఆదేశాలిచ్చిన వెంటనే లొంగిపోయి ఉంటే ఆయన గౌరవాన్ని కాపాడుకునే వారు’ అని అన్నారు.

ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారు..
మాజీ కేంద్రమంత్రి చిదంబరాన్ని రాత్రి సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన కుమారుడు కార్తి చిదంబరం గురువారం దిల్లీకి చేరుకున్నారు. చెన్నై నుంచి బయల్దేరిన ఆయన దిల్లీ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంలోని అవినీతిని ఎండగడుతున్నందుకే చిదంబరంపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమాలను ప్రశ్నించేవారి గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఇప్పటికి 20సార్లు సమన్లు జారీ చేశారని, నాలుగు సార్లు తమ ఇంటిపై సీబీఐ దాడులు చేసిందని, ఇప్పటివరకు వాటిపై కేసుపెట్ట లేదన్నారు. తన జీవితంలో ఇంతవరకు పీటర్‌, ఇంద్రాణీ ముఖర్జీని కలవనే లేదని స్ఫష్టం చేశారు. సీబీఐ విచారణ సమయంలోనే వారిని తొలిసారి కలిశానని, ఎఫ్‌ఐపీబీలో తనకు ఎవరూ తెలీదని, ఆ పద్ధతి కూడా తనకు తెలియదని తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.