Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146151
            [news_title_telugu_html] => 

ప్రియాంకపై ఫిర్యాదు: పాక్‌కు జావేద్‌ అక్తర్‌ కౌంటర్‌

[news_title_telugu] => ప్రియాంకపై ఫిర్యాదు: పాక్‌కు జావేద్‌ అక్తర్‌ కౌంటర్‌ [news_title_english] => Priyanka Chopra Views On Kashmir as An Indian says Javed [news_short_description] => ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాను ‘శాంతిదూత (పీస్‌ అంబాసిడర్‌) హోదా’ నుంచి తొలగించాలంటూ  ఐక్యరాజ్యసమితిని పాకిస్థాన్‌ కోరడంపై ప్రముఖ కవి జావేద్‌ అక్తర్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. జమ్మూకశ్మీర్‌ విభజన...... [news_tags_keywords] => Priyanka Chopra,Javed Akhtar,Article 370 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 14:49:03 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రియాంకపై ఫిర్యాదు: పాక్‌కు జావేద్‌ అక్తర్‌ కౌంటర్‌ - Priyanka Chopra Views On Kashmir as An Indian says Javed - EENADU
close

తాజా వార్తలు

ప్రియాంకపై ఫిర్యాదు: పాక్‌కు జావేద్‌ అక్తర్‌ కౌంటర్‌

కోల్‌కతా: ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాను ‘శాంతిదూత (పీస్‌ అంబాసిడర్‌) హోదా’ నుంచి తొలగించాలంటూ  ఐక్యరాజ్యసమితిని పాకిస్థాన్‌ కోరడంపై ప్రముఖ కవి జావేద్‌ అక్తర్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆమె ఓ సగటు భారతీయురాలిగా స్పందించారని చెప్పారు. భారతీయురాలినే అనే దృక్పథంతోనే ఆమె కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారన్నారు. ప్రియాంక వ్యాఖ్యలు రుచించకపోతే పాక్‌ తమకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చని సూచించారు. తనకు ప్రియాంక వ్యక్తిగతంగా బాగా తెలుసున్నారు. ఆమె చక్కని సంస్కృతిని కలిగి ఉండటమే కాకుండా మంచి విద్యావంతురాలని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. కశ్మీర్‌లో తాజా పరిస్థితులపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా..  అక్కడ ఏం జరుగుతోందో తనకు తెలియడంలేదన్నారు. ఎటువంటి సమాచారం అందుబాటులో లేకపోవడంతో వాస్తవంగా అక్కడేం జరుగుతోందో మనందరికీ తెలియడంలేదన్నారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ వాతావరణం నెలకొందని.. కొన్నిచోట్ల ఆంక్షలు సైతం కొనసాగుతున్నాయని మనందరికీ తెలుసు కదా అని జావేద్‌ అక్తర్‌ అన్నారు.

కశ్మీర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రియాంకా చోప్రా వంతపాడుతున్నారని.. ఆమెను శాంతిదూత హోదా నుంచి తొలగించాలని ఐరాసకు పాక్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య అణు యుద్ధం జరగాలని ఆమె ఆకాంక్షిస్తున్నారని పాక్‌ ఆరోపించింది. అణ్వాయుధాలను ముందుగా ప్రయోగించకూడదన్న భారత్‌ విధానం.. పరిస్థితులను బట్టి మారవచ్చంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను సైతం ప్రియాంకా చోప్రా స్వాగతించారని యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రిటా హెచ్‌ ఫోర్‌కు రాసిన లేఖలో పాక్‌ ప్రస్తావించింది. శాంతి దూత పాటించాల్సిన కనీస నియమాలకు విరుద్ధంగా ఆమె వ్యవహరిస్తున్నందున ఆమెను ఆ  పదవి నుంచి తొలగించాలని యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రిటా హెచ్‌ ఫోర్‌కు పాకిస్థాన్‌ మానవ హక్కుల మంత్రి షిరీన్‌ మజారి ఇటీవల లేఖ రాశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.