Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146168
            [news_title_telugu_html] => 

చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ

[news_title_telugu] => చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ [news_title_english] => Chidambaram being taken from CBI Office to court for hearing [news_short_description] => ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని సీబీఐ అధికారులు దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. పటిష్ట భద్రత నడుమ ఆయన్ను కోర్టుకు తరలించారు. [news_tags_keywords] => Chidambaram,CBI,Court [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 15:23:50 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ - Chidambaram being taken from CBI Office to court for hearing - EENADU
close

తాజా వార్తలు

చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ

దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని సీబీఐ అధికారులు దిల్లీలోని రౌస్‌ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. పటిష్ట భద్రత నడుమ ఆయన్ను తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టారు. సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. చిదంబరం రిమాండ్‌ ప్రతిని తుషార్‌ మెహతా న్యాయమూర్తికి అందజేశారు. అరెస్ట్‌ చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరిచినట్లు సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. 2 గంటల్లో హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇస్తే చిదంబరం నుంచి స్పందన రాలేదని న్యాయమూర్తికి తెలిపారు. దీంతో పాటు ఈ అంశంలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చూపించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదని తుషార్‌ మెహతా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఐదు రోజుల పాటు చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి ఇవ్వాలని ఆయన కోరారు. దాంతో తుషార్‌మెహతా వాదనలు పూర్తి చేశారు.

రాజకీయ కారణాలతోనే..:కపిల్‌ సిబల్‌

చిదంబరం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ఆర్థిక మంత్రిగా ఫారెన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎఫ్‌ఐపీబీ)కు సంబంధించిన విషయంలో చిదంబరం ఒక్కరే నిర్ణయం తీసుకోలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బోర్డులో ఆర్థిక మంత్రితో పాటు ఆరుగురు కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారని.. ఆ బోర్డు అప్పుడు సంయుక్తంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆనాడు బోర్డులో సభ్యుడిగా ఉన్న ఒకరు ఆర్బీఐ గవర్నర్‌గా.. మిగిలిన వాళ్లు ఉన్నత స్థానాల్లోకి వెళ్లారని న్యాయస్థానానికి వివరించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం రాజకీయ కారణాలతోనే చిదంబరంను ఈ కేసులో ప్రశ్నిస్తున్నారని కపిల్‌ సిబల్‌ కోర్టుకు విన్నవించారు.

నేను కూర్చోను.. సంప్రదాయాల ప్రకారమే నడుచుకుంటా!

అంతకుముందు కోర్టు హాల్లో నిలబడి ఉన్న చిదంబరాన్ని కుర్చీలో కూర్చోవాలని తుషార్‌మెహతా సూచించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. కోర్టు సంప్రదాయాల ప్రకారమే తాను నడుచుకుంటానని ఈ సందర్భంగా చిదంబరం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు చిదంబరాన్ని సీబీఐ మూడు గంటలపాటు ప్రశ్నించింది. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. చిదంబరంను కోర్టుకు తీసుకొచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కపిల్‌ సిబాల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ, చిదంబరం సతీమణి నళినీ చిదంబరం, కుమారుడు కార్తీ కూడా అక్కడికి వచ్చారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.