Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146206
            [news_title_telugu_html] => 

చిదంబరం అరెస్టుపై తమిళ నేతల స్పందన ఇదీ..

[news_title_telugu] => చిదంబరం అరెస్టుపై తమిళ నేతల స్పందన ఇదీ.. [news_title_english] => Tamilnadu leaders reaction on Chidambaram Arrest [news_short_description] => ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అరెస్టు వ్యవహారాన్ని పలు విపక్షాలు తప్పుబడుతున్నాయి. చిదంబరంపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నాయి. చిదంబరాన్ని... [news_tags_keywords] => Chidambaram,CBI,Tamilnadu,Politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 18:00:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చిదంబరం అరెస్టుపై తమిళ నేతల స్పందన ఇదీ.. - Tamilnadu leaders reaction on Chidambaram Arrest - EENADU
close

తాజా వార్తలు

చిదంబరం అరెస్టుపై తమిళ నేతల స్పందన ఇదీ..

దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అరెస్టు వ్యవహారాన్ని పలు విపక్షాలు తప్పుబడుతున్నాయి. చిదంబరంపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నాయి. చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు దర్యాప్తు సంస్థలు వ్యవహరించిన తీరును కొందరు నేతలు తప్పుబడుతున్నారు. చిదంబరం సొంత రాష్ట్రమైన తమిళనాట పలు రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తంచేశాయి. చిదంబరం అరెస్టుకు నిరసనగా తమిళనాడులో పలుచోట్ల కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.  అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. చెన్నైలోని అన్నానగర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్‌ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. చిదంబరం అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు ఈ అంశంపై పశ్చిమ్‌బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.  చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల తీరు బాగాలేదని ఆక్షేపించారు. చట్టపరమైన అంశాల జోలికి తాను వెళ్లబోనన్నారు. కానీ చిదంబరం ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడని.. ఆయన ఈ దేశానికి హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా సేవలందించారని దీదీ గుర్తు చేశారు. 

అధికారుల తీరు సిగ్గుచేటు: స్టాలిన్‌
చిదంబరం అరెస్టుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ స్పందించారు. సీబీఐ అధికారులు గోడలు దూకి అరెస్టు చేయడాన్ని తాను చూశానని.. ఈ వ్యవహారం సిగ్గుచేటన్నారు. ఆయన ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించినప్పటికీ.. అధికారులు ఆయన్ను అరెస్టుచేశారని చెప్పారు. చిదంబరం న్యాయ నిపుణుడని.. ఈ కేసును ఆయన న్యాయపరంగానే ఎదుర్కొంటారని విశ్వాసం వ్యక్తంచేశారు.

మాకేం సంబంధం లేదు: అన్నాడీఎంకే
చిదంబరం తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నాడీఎంకే నేత, మంత్రి పాండ్యరాజన్‌ అన్నారు. చిదంబరం కేంద్రమంత్రిగా పనిచేశారని.. ఆయన్ను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడితే తాము సమర్థించబోమన్నారు. చిదంబరం అరెస్టు వ్యవహారంలో తమకెలాంటి సంబంధంలేదని ఆయన స్పష్టంచేశారు. 

చిదంబరం తీరు గర్హనీయం: భాజపా
చిదంబరం అరెస్టయిన తర్వాత పెద్ద గందరగోళం నెలకొందని.. అందుకే ఆయనే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందర రాజన్‌ అన్నారు. ఆయన నిజాయతీగా న్యాయపరంగా ఈ కేసు ఎదుర్కుంటే బాగుండేదన్నారు. కానీ, ఆయన సమన్లు అందుకోకుండా తిరస్కరించడం గర్హనీయమన్నారు. ఈ కేసు ఎదుర్కోవడంలో చిదంబరం వ్యవహరించిన తీరు ఓ చెడు సంప్రదాయంగా నిలిచిపోతుందని ఆమె విమర్శించారు.

రాజకీయ ప్రేరేపిత చర్య: వీకేసీ
చిదంబరం అరెస్టు రాజకీయ ప్రేరేపిత చర్య అని విడుదలై చిరుత్తిగళ్‌ కట్చి (వీసీకే) చీఫ్‌ తోల్‌ తిరుమవలవన్‌ అన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకే భాజపా ఇలా చేస్తోందని ఆయన ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో భాజపా చేస్తున్న ఇలాంటి చర్యలను తమ పార్టీ ఖండిస్తుందన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.