Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146211
            [news_title_telugu_html] => 

ధరిత్రి ఊపిరితిత్తులు మండుతున్నాయి: అలియా

[news_title_telugu] => ధరిత్రి ఊపిరితిత్తులు మండుతున్నాయి: అలియా [news_title_english] => NASA shares satellite pic of smoke covering Brazil [news_short_description] => భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు ఆధారమైన అమెజాన్‌ అడవులు ఇప్పుడు పొగతో నిండిపోయాయి. [news_tags_keywords] => Amazon rainforest , Brazil ,NASA [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1164302110244126720 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 19:10:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ధరిత్రి ఊపిరితిత్తులు మండుతున్నాయి: అలియా - NASA shares satellite pic of smoke covering Brazil - EENADU
close

తాజా వార్తలు

ధరిత్రి ఊపిరితిత్తులు మండుతున్నాయి: అలియా

వాషింగ్టన్‌: భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు ఆధారమైన అమెజాన్‌ అడవులు ఇప్పుడు పొగతో నిండిపోయాయి. ఈ సమయంలో అక్కడి అడవుల్లో ఇలా కార్చిచ్చు రగులుకోవడం సర్వసాధారణమే అయినా, ఈ సారి అది రికార్డు స్థాయిలో ఉంది. ఈ తీవ్రతను శాటిలైట్ చిత్రాల్లో బంధించి నాసా ట్విటర్‌లో షేర్ చేసింది. ‘బ్రెజిల్‌లోని వివిధ రాష్ట్రాల్లో వ్యాపించిన అమెజాన్‌ అడవుల్లోని కార్చిచ్చుకు సంబంధించిన నేచురల్ కలర్‌ శాటిలైట్ చిత్రమిది. అధిక ఉష్ణోగ్రత, తక్కువ మొత్తంలోని ఆర్థ్రత వల్ల ఈ సమయంలో ఇది సాధారణమే అయినా, రికార్డు స్థాయిలో ఈ మంటలు చెలరేగుతున్నాయి’ అని నాసా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను అనేక మంది లైక్‌ చేయడంతో పాటు రీట్వీట్ చేశారు. దీనిపై ఆస్కార్ విజేత లియోనార్డో డికాప్రియో, బాలీవుడ్‌ స్టార్లు అక్షయ్ కుమార్, అలియా భట్, టెన్నిస్‌ క్రీడాకారుడు నొవాక్‌ జకోవిచ్‌ తదితరులు ట్విటర్‌లో తమ ఆందోళనను వ్యక్తం చేశారు. 
హాలీవుడ్ స్టార్‌ లియోనార్డో డికాప్రియో: భూగ్రహం మీద 20శాతం ప్రాణవాయువును అందించే అటవీ ప్రాంతం ఇలా మంటల్లో చిక్కుకుపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రపంచానికి ఊపిరితిత్తులుగా ఉండే ఈ అటవీ ప్రాంతం 16 రోజులుగా మండిపోతుంది. కానీ మీడియా దీని మీద పెద్దగా దృష్టిసారించడం లేదు. ఎందుకు?
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్: రెండు వారాలకు పైగా కార్చిచ్చులో చిక్కుకుపోయిన అమెజాన్ అడవులను ఇలా చూడటం హృదయ విదారకరం, ఆందోళనక పరిణామం. ఇది 20శాతం ప్రాణవాయును అందిస్తోంది. ఇది ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. ఈ వాతావరణ మార్పులతో భూగ్రహం తట్టుకుంటుందేమో కానీ, మన వల్ల కాదు.
బాలీవుడ్ నటి అలియా భట్: మన గ్రహం ఊపిరితిత్తులు మండిపోతున్నాయి! లక్షల సంఖ్యలో జీవరాశికి జీవనాధారం ఈ అటవీ ప్రాంతం. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను నియంత్రణలో ఉంచడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఈ ప్రాంతం సురక్షితంగా లేకపోతే మనకు మనుగడ లేదు.
టెన్నిస్‌ స్టార్ నొవాక్ జకోవిచ్: హృదయ విదారకరం. 

 

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.