Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146215
            [news_title_telugu_html] => 

నీరవ్‌ మోదీకి కస్టడీ పొడిగింపు

[news_title_telugu] => నీరవ్‌ మోదీకి కస్టడీ పొడిగింపు [news_title_english] => Nirav modi judicial custody extended till sept 19 [news_short_description] => రూ.13వేల కోట్లకు పైగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)ని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ జ్యుడిషియల్‌ కస్టడీని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్స్‌ కోర్టు [news_tags_keywords] => Nirav Modi,PNB scam,Judicial custody [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 23:35:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నీరవ్‌ మోదీకి కస్టడీ పొడిగింపు - Nirav modi judicial custody extended till sept 19 - EENADU
close

తాజా వార్తలు

నీరవ్‌ మోదీకి కస్టడీ పొడిగింపు

లండన్‌: రూ.13వేల కోట్లకు పైగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)ని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ జ్యుడిషియల్‌ కస్టడీని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్స్‌ కోర్టు మరోసారి పొడిగించింది. జైలు నుంచి వీడియో లింక్‌ ద్వారా అతడిని న్యాయస్థానం విచారించింది. అనంతరం న్యాయమూర్తి టాన్‌ ఇక్రమ్‌.. నీరవ్‌ మోదీకి సెప్టెంబర్‌ 19 వరకు జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగిస్తూ తీర్పు వెలువరించారు. 
ప్రస్తుతం నీరవ్‌ మోదీ ఆగ్నేయ లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పీఎన్‌బీని మోసం చేసిన ఘటన గతేడాది జనవరిలో వెలుగులోకి రావడంతో తన మేనమామ మొహుల్‌ చోక్సీతో కలిసి నీరవ్‌ విదేశాలకు చెక్కేశాడు. ఈ ఏడాది మార్చి 19న స్కాట్‌లాండ్‌ యార్డ్‌ పోలీసులు నీరవ్‌ను అరెస్టు చేశారు. అప్పటినుంచి అతడు జైలులోనే ఉంటున్నాడు. భారత దర్యాప్తు సంస్థలు అతడిని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్‌కు రావాలని గతంలో సీబీఐ, ఈడీ సంస్థలు సమన్లు పంపినా స్పందించలేదు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.