Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146241
            [news_title_telugu_html] => 

కశ్మీర్‌ నేతల విడుదలెప్పుడు?

[news_title_telugu] => కశ్మీర్‌ నేతల విడుదలెప్పుడు? [news_title_english] => No clarity on the release of political leaders in JK [news_short_description] => జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా సహా పలువురు రాజకీయ నేతల నిర్బంధం మరికొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం...... [news_tags_keywords] => jammu kashmir,political leaders,article 370 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 23:51:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కశ్మీర్‌ నేతల విడుదలెప్పుడు? - No clarity on the release of political leaders in JK - EENADU
close

తాజా వార్తలు

కశ్మీర్‌ నేతల విడుదలెప్పుడు?

న్యూదిల్లీ: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా సహా పలువురు రాజకీయ నేతల నిర్బంధం మరికొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. వారి విడుదల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతా లేకపోవడం ఇందుక్కారణం. ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన వంటి పరిణామాల నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 5 నుంచి వారు నిర్బంధంలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడేంత వరకు వారు విడుదలయ్యే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు వారి విడుదలకు సంబంధించి ఎలాంటి స్పష్టతా లేదని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. విడుదల ఎప్పుడనేది ఇప్పట్లో చెప్పడం కష్టమని పేర్కొన్నారు.

పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటనకు ముందు రోజు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాను నిర్బంధించి.. వేర్వేరు అతిథి గృహాల్లో ఉంచారు. మరో మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లాను ఆయన నివాసంలోనే గృహనిర్బంధం చేశారు. వీరితోపాటు కశ్మీర్‌ లోయలోని ఇతర పార్టీలకు చెందిన నేతలను సైతం అదుపులోకి తీసుకోగా.. వారి సంఖ్య ఎంత అనేది ప్రభుత్వ వర్గాలు ఇంత వరకు వెల్లడించలేదు. అనధికారింగా ఈ సంఖ్య 2వేల వరకు ఉంటుందని అంచనా. మరోవైపు ప్రస్తుతం కశ్మీర్‌లోయలో కొన్ని చోట్ల సాధారణ పరిస్థితులు నెలకొనగా.. మరికొన్న చోట్ల ఆంక్షలు కొనసాగుతున్నాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.