Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000062
            [news_title_telugu_html] => 

అక్కడ సమాచార వ్యవస్థ పునరుద్ధరించండి

[news_title_telugu] => అక్కడ సమాచార వ్యవస్థ పునరుద్ధరించండి [news_title_english] => United Nations Human Rights Experts asks India to End Shutdown in Jammu Kashmir [news_short_description] => కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత అక్కడ విధించిన ఆంక్షల నేపథ్యంలో ఐరాస మానవ హక్కుల పరిరక్షణ ప్రతినిధులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్‌లో... [news_tags_keywords] => United Nations, Human Rights Experts, Jammu Kashmir [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 23:53:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అక్కడ సమాచార వ్యవస్థ పునరుద్ధరించండి - United Nations Human Rights Experts asks India to End Shutdown in Jammu Kashmir - EENADU
close

తాజా వార్తలు

అక్కడ సమాచార వ్యవస్థ పునరుద్ధరించండి

ఐరాస మానవ హక్కుల ప్రతినిధుల వెల్లడి

దిల్లీ: కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత అక్కడ విధించిన ఆంక్షల నేపథ్యంలో ఐరాస మానవ హక్కుల పరిరక్షణ ప్రతినిధులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్‌లో వెంటనే పరిస్థితులు చక్కదిద్దాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. సమాచార ప్రసార వ్యవస్థను పునరుద్ధరించాలని సూచించారు. ప్రస్తుత ఆంక్షలు పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని అన్నారు. మొత్తం రాష్ట్ర ప్రజలకు ఈ శిక్ష విధించడం సరికాదని.. ఆంక్షలను ఇంకా కొనసాగించడం వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వారు కశ్మీర్‌ వ్యవహారంపై ఓ నివేదిక తయారు చేశారు.

జమ్ము కశ్మీర్‌ వ్యాప్తంగా సమాచార వ్యవస్థను ఆగస్టు 4 నుంచి పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. సెల్‌ఫోన్లు, టీవీలు, అంతర్జాలం స్తంభించిపోయాయి. జమ్ము ప్రాంతంలో కొన్ని చోట్ల నిబంధనలు సడలించినా కశ్మీర్‌ లోయలో ఇంకా పరిస్థితి కట్టుదిట్టంగానే ఉంది. పాఠశాలలు తెరిచిన చోట పిల్లలను స్కూలుకు పంపేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తుండడం గమనార్హం.

అయితే, ఆర్టికల్‌ 370 రద్దును సహించలేని పాకిస్థాన్‌... ఉగ్రవాదుల ద్వారా కశ్మీర్‌లో అశాంతి నెలకొల్పే ప్రయత్నాలు చేస్తుండడంతో భారత్‌ అప్పుడే ఆంక్షలను తొలగించేందుకు సిద్ధంగా లేదు. కశ్మీర్‌ అనేది దేశ అంతర్గత వ్యవహారమని, ఆ ప్రాంతాన్ని ఎలా ఉంచాలో కొన్ని దేశాలు ఇక్కడి ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదని ఐరాసలో భారత రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.