Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146672
            [news_title_telugu_html] => 

తమిళనాడులో ఉగ్రవాదుల చొరబాటు!

[news_title_telugu] => తమిళనాడులో ఉగ్రవాదుల చొరబాటు! [news_title_english] => Alert in Tamil Nadu after intel of Lashkar terrorists intrusion [news_short_description] => దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి [news_tags_keywords] => Tamil Nadu,Lashkar-e-Taiba,terrorists,Terror Attack [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => https://www.facebook.com/ETVTelangana/videos/407705310103348/ [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 11:02:17 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తమిళనాడులో ఉగ్రవాదుల చొరబాటు! - Alert in Tamil Nadu after intel of Lashkar terrorists intrusion - EENADU
close

తాజా వార్తలు

తమిళనాడులో ఉగ్రవాదుల చొరబాటు!

శ్రీలంక మీదుగా దేశంలోకి లష్కరే ముష్కరులు

నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్రంలో హైఅలర్ట్‌

చెన్నై: దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి చొరబడి కొయంబత్తూర్‌లో దాగి ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం రావడంతో రాష్ట్రంలో హెచ్చరికలు జారీ చేశారు.

ముష్కరుల్లో ఒకరు పాకిస్థానీ కాగా.. ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలుగా తెలుస్తోంది. హిందువులుగా దేశంలోకి చొరబడి ఉగ్ర చర్యలకు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి. రద్దీ ప్రదేశాలు, ప్రముఖ రాజకీయ నాయకులు, విదేశీ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని వీరు దాడులకు పాల్పడే ప్రమాదముందని పేర్కొన్నాయి. 

దీంతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను ముమ్మరం చేశారు. కొయంబత్తూర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. నగరంలోని అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. అటు చెన్నైలో బలగాలను పెంచారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌, బస్‌స్టాండ్‌, ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తీర ప్రాంత జిల్లాలన్నింటికీ హెచ్చరికలు జారీ చేశారు. 

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గరి నుంచి మన దేశానికి ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి. కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు అఫ్గానిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను పాకిస్థాన్ ఉసిగొల్పనుందని నిఘా సంస్థలు ఇటీవల హెచ్చరించాయి. ఆ ఉగ్రమూకలు కశ్మీర్‌లోకి చొరబడటానికి ఇప్పటికే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రర్‌ లాంచ్ ప్యాడ్స్‌ వద్ద సిద్ధంగా ఉన్నారని తెలిపాయి. 
 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.