Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146703
            [news_title_telugu_html] => 

శ్రీనగర్‌లో మళ్లీ ఆంక్షలు

[news_title_telugu] => శ్రీనగర్‌లో మళ్లీ ఆంక్షలు [news_title_english] => Restrictions imposed in Srinagar after march call to UN office [news_short_description] => జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో శుక్రవారం మరోసారి ఆంక్షలు విధించారు. అధికరణ 370 రద్దుకి వ్యతిరేకంగా కొన్ని వేర్పాటువాద సంస్థలు నిరసనకు ... [news_tags_keywords] => Srinagar,Jammu Kashmir,Article 370 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => wUZcnprCBig [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 14:37:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
శ్రీనగర్‌లో మళ్లీ ఆంక్షలు - Restrictions imposed in Srinagar after march call to UN office - EENADU
close

తాజా వార్తలు

శ్రీనగర్‌లో మళ్లీ ఆంక్షలు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో శుక్రవారం మరోసారి ఆంక్షలు విధించారు. అధికరణ 370 రద్దుకి వ్యతిరేకంగా కొన్ని వేర్పాటువాద సంస్థలు నిరసనకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రి నగరంలో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ఎక్కడికక్కడ బారీకేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రదర్శనకు ఎలాంటి అనుమతులు లేవని.. ప్రజలు సమూహాలుగా తిరగొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.  కశ్మీర్‌పై కేంద్రం నిర్ణయం తరువాత రాష్ట్రవ్యాప్తంగా విధించిన ఆంక్షల్ని ఈ వారమే దశలవారీగా తొలిగించిన విషయం తెలిసిందే. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ నేతల్ని ఇంకా నిర్బంధంలోనే ఉంచారు. 

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దుతో పాటు, రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా బలగాలను మొహరించి కఠిన ఆంక్షల్ని విధించారు. పరిస్థితి మెరుగుపడుతున్న కొద్దీ వాటిని తొలగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే శ్రీనగర్‌, కశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల్ని ఎత్తివేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈవారం అనేక ప్రాంతాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు తెరచుకొన్నాయి. కానీ, నిరసన ప్రదర్శనలకు వేర్పాటువాద సంస్థల తాజా పిలుపుతో మరోసారి ఆంక్షల్ని విధించాల్సి వచ్చింది.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.