Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146731
            [news_title_telugu_html] => 

కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తెరుస్తాం

[news_title_telugu] => కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తెరుస్తాం [news_title_english] => Pakistan stands ready to open Kartarpur Corridor [news_short_description] => కర్తార్‌పూర్‌ కారిడార్‌ను సిక్కు భక్తుల కోసం తెరవనున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది. ఈ మేరకు పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి మొహమూద్‌ ఖురేషీ..అఫ్గానిస్థాన్‌ అధికారులతో తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రి...... [news_tags_keywords] => Kartarpur Corridor,Pakistan,India [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 20:34:18 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తెరుస్తాం - Pakistan stands ready to open Kartarpur Corridor - EENADU
close

తాజా వార్తలు

కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తెరుస్తాం

ప్రకటించిన పాకిస్థాన్‌


ఇస్లామాబాద్‌: సిక్కు భక్తుల కోసం కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తెరవనున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది. ఈ మేరకు పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్‌ ఖురేషీ..అఫ్గానిస్థాన్‌ అధికారులతో తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌ మీద అక్కసు వెళ్లగక్కడానికి ఉన్న ఏ అవకాశాన్నీ పాక్‌ వదులుకోవడంలో లేదు. కానీ ఈసమయంలో కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభిస్తామని చెప్పడం గమనార్హం. ‘భారత్‌తో మాకు ఎలాంటి తగాదాలున్నప్పటికీ..కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తెరవాలని నిర్ణయించుకున్నాం. సిక్కు యాత్రికులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. బాబా గురు నానక్‌ 550వ జయంతి సందర్భంగా వారిని ఆహ్వానించనున్నాం’ అని ఖురేషీ తెలిపారు.

పాకిస్థాన్‌లోని దర్బార్‌ సాహిబ్‌ను  పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలోని గురునానక్‌ మందిరాన్ని కర్తార్‌పూర్‌ కారిడార్‌ కలుపుతోంది. రావి నది ఒడ్డున ఉన్న ప్రముఖ గురుద్వారాను సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు.సిక్కుల మతగురువు గురునానక్ తన జీవితంలోని చివరి 18 ఏళ్లు ఇక్కడే గడిపారు. ఇక్కడే తుదిశ్వాస విడిచారు. అందుకే ఈ గురుద్వారాకు అంత ప్రాధాన్యం. దేశ విభజనకు ముందు నుంచి కూడా పంజాబ్ ప్రాంతంలో ఈ గురుద్వారాకు చాలా ప్రాముఖ్యం ఉంది. అయితే.. విభజనతో ఈ ప్రాంతం పాక్ భూభాగంలో కలవడంతో భారత్‌లోని పంజాబ్ ప్రాంత సిక్కులు నిరాశకు గురయ్యారు. నాటి నుంచి అతికష్టం మీద ఇక్కడకు రాకపోకలు సాగిస్తున్నారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.