Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000546
            [news_title_telugu_html] => 

ఆయన విమర్శకు పదునెక్కువ..!

[news_title_telugu] => ఆయన విమర్శకు పదునెక్కువ..! [news_title_english] => arun jaitley a good critic [news_short_description] => విమర్శల బురద ఎత్తిపోసుకోవడం రాజకీయాల్లో సర్వసాధారణం..  అతికొద్ది మంది నాయకులు మాత్రమే ఇటువంటి బురద రాజకీయాలకు దూరంగా ఉంటారు.. అటువంటి వారు విమర్శలు చేస్తే ఆ [news_tags_keywords] => arun jaitley,bjp,politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 14:40:55 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆయన విమర్శకు పదునెక్కువ..! - arun jaitley a good critic - EENADU
close

తాజా వార్తలు

ఆయన విమర్శకు పదునెక్కువ..!

ఇంటర్నెట్‌డెస్క్‌, ప్రత్యేకం: విమర్శల బురద ఎత్తిపోసుకోవడం రాజకీయాల్లో సర్వసాధారణం..  అతికొద్ది మంది నాయకులు మాత్రమే ఇటువంటి బురద రాజకీయాలకు దూరంగా ఉంటారు.. అటువంటి వారు విమర్శలు చేస్తే ఆ పదునుకు ప్రత్యర్థులు పూర్తి ఆత్మరక్షణలో పడిపోతారు.  ఆధారాలతో సహేతుకంగా ఉండటంతో అవి తర్కానికి నిలుస్తాయి. అటువంటి నాయకులు భారత రాజకీయాల్లో అత్యంత అరుదుగా ఉన్నారు. అరుణ్‌ జైట్లీ కూడా ఆ కోవకు చెందిన నాయకుడే. వివాదాస్పద అంశాలపై ఆయన స్థాయిని తగ్గించుకొని మరీ విమర్శలు చేయరు. పాలసీలను విమర్శించే విషయంలో ఆయన  తన పరాయి భేదాలను చూడరు. 

ఆర్‌బీఐ వర్సెస్‌ జైట్లీ..

మోదీ 1.0 సమయంలో  ఆయన ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలను  నిర్వహించారు. జీఎస్‌టీ, నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆయన ఆర్‌బీఐతో నేరుగా తలపడ్డారు. ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నాటి డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం  ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. దీంతో ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో అరుణ్‌ జైట్లీ నేరుగా రంగంలోకి ఆర్‌బీఐ విమర్శలను తిప్పికొట్టారు. ‘‘2008-14 మధ్యలో బ్యాంకులు అడ్డగోలుగా, వివక్ష పూరితంగా రుణాలను మంజూరు చేశాయి. ఆ రుణాలు ఇప్పుడు ఎన్‌పీఏలుగా మారి బ్యాంకింగ్‌ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తానికి అజమాయిషీ సంస్థ అయిన ఆర్‌బీఐదే బాధ్యత . అప్పటి వరకు ఏటా 14శాతం రుణ వృద్ధి ఉంటే.. ఒక్కసారిగా అది 31శాతానికి పెరగటానికి ఇదే కారణం. 2008లో రూ.18లక్షల కోట్లు ఉన్న రుణాలు 2014నాటికి రూ.55లక్షల కోట్లకు ఎలా చేరాయన్నారు. బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు సంస్థల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి’’ అని విరాల్‌ ఆచార్యకు చురకలు అంటించారు. మరో పక్క అదే సమయంలో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ కూడా ఆర్‌బీఐ గతంలో  కంటే మరింత స్వేచ్ఛగా ఉందంటూ  నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం విమర్శల నుంచి బయటపడింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆర్‌బీఐ అధికారాలకు కత్తెరవేసింది.

కేజ్రీవాల్‌తో క్షమాపణలు చెప్పించి..

తనపై వచ్చే తీవ్రమైన ఆరోపణల విషయంలో జైట్లీ చట్టపరంగా స్పందిస్తారు. దిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌లో జైట్లీ అవకతవకలకు పాల్పడ్డారని  ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శలు చేశారు. దీనిపై కేజ్రీవాల్‌ను ఆయన కోర్టుకు లాగారు.. ఎట్టకేలకు అరవింద్‌ కేజ్రీవాల్‌ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది. ఈ క్రమంలో ఆయన కోర్టు హాల్లో నేరుగా ప్రముఖ లాయర్‌ రామ్‌జెఠ్మాలనీ నుంచి ప్రశ్నలను ఎదుర్కొన్నారు. 

వెనక్కి తగ్గిన స్వామి..

అరుణ్‌ జైట్లీకి భాజపాకు చెందిన మరో నాయకుడు సుబ్రమణ్య స్వామికి అభిప్రాయభేదాలు తీవ్రంగా ఉండేవి. అప్పట్లో ప్రధాన ఆర్థిక సలహాదారులు అరవింద్‌ సుబ్రమణియన్‌ నియామకాన్ని తప్పుపడుతూ  సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేరుగా రంగంలోకి దిగి ఉచిత సలహాలు ఇవ్వొద్దని స్వామికి హితబోధ చేశారు. తన బృందంలోని వ్యక్తి నైతిక స్థైర్యం దెబ్బతినకూడదనే అరవింద్‌ సుబ్రమణియన్‌ విషయంలో ఆయన నేరుగా సుబ్రమణ్యం స్వామికి  కౌంటర్‌ ఇచ్చారు. అప్పట్లో భాజపా నాయకులు కూడా జైట్లీకి మద్దతుగా నిలవడంతో స్వామి తాను అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదంటూ  ట్విటర్‌లో పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత కూడా అవకాశం దొరికినప్పుడు అరుణ్‌ జైట్లీని విమర్శిస్తూనే ఉన్నారు. కానీ, జైట్లీ వీటికి స్పందించలేదు.

జీఎస్‌టీ, నోట్ల రద్దుకు బలమైన మద్దతుదారు..

నోట్ల రద్దు, జీఎస్‌టీపై సర్వత్రా విమర్శలు వస్తున్నా జైట్లీ మాత్రం వాటిని బలంగా సమర్థించారు. ఆయన ఓ సారి ఐఎంఎఫ్‌ ప్రధాన కార్యాలయంలో ఓ  కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘నోట్ల రద్దు, జీఎస్‌టీలు దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకొంటే భారత్‌ తేలిగ్గా కోలుకుంటుంది.’’ అని ప్రకటించారు.  

బ్రిటన్‌పై విమర్శలు..

విజయ్‌ మాల్యాను భారత్‌ తీసుకురావడానికి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో జైట్లీ బ్రిటన్‌ చట్టాలను సునిశితంగా విమర్శించారు. ‘‘బ్రిటన్‌ చాలా నాగరిక సమాజం. కానీ, ఇప్పుడది పరారీలో ఉన్న నేరస్థులకు స్వర్గంగా మారింది. నేరాలు చేసి అక్కడకు పారిపోయిన వారిని తిరిగి అప్పగించడానికి కూడా చాలా జాప్యం చేస్తోంది. మనం వారిని అక్కడ నుంచి బలవంతంగా తీసుకురాలేము. ఇది నాగరికత కాదు.. బ్రిటన్‌ నాగరికత అసలు కాదు..’’ అంటూ ఆయన విజయ్‌మాల్య వ్యవహారంపై స్పందించారు.  


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.