Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000545
            [news_title_telugu_html] => 

అర్థవంతమైన విమర్శలు ఆయనకే సొంతం..

[news_title_telugu] => అర్థవంతమైన విమర్శలు ఆయనకే సొంతం.. [news_title_english] => jaitley Blogs Were Mightier Than Verbal Duels​ [news_short_description] => కీలక నేత సుష్మాస్వరాజ్‌ను పోగొట్టుకొన్న దుఃఖాన్ని ఇంకా దిగమింగకముందే మరో ‘కమల’ తార నేల రాలింది. చరిత్రాత్మక సంస్కరణలు జీఎస్టీ, నోట్ల రద్దు సమయంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన గొప్ప............. [news_tags_keywords] => Arun Jaitley,BJP,Congress [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 00:18:14 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అర్థవంతమైన విమర్శలు ఆయనకే సొంతం.. - jaitley Blogs Were Mightier Than Verbal Duels​ - EENADU
close

తాజా వార్తలు

అర్థవంతమైన విమర్శలు ఆయనకే సొంతం..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కీలక నేత సుష్మాస్వరాజ్‌ను పోగొట్టుకొన్న దుఃఖాన్ని ఇంకా దిగమింగకముందే మరో ‘కమల’ తార నేల రాలింది. చరిత్రాత్మక సంస్కరణలు జీఎస్టీ, నోట్ల రద్దు సమయంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన గొప్ప నేత అరుణ్‌ జైట్లీ అనేక మంది అభిమానులు, భాజపా శ్రేణుల్ని శోకసంద్రంలోకి నెట్టి లోకాన్ని వీడారు. అనర్గళంగా మట్లాడుతూ తన భావాల్ని ప్రజల్లోకి సూటిగా, ప్రభావవంతంగా తీసుకెళ్లగలిగే నేతల జాబితాలో అరుణ్‌ జైట్లీ ముందుంటారు. తన, పార్టీ అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. తాను చేపట్టబోయే ప్రతిపనిపై కచ్చితమైన అభిప్రాయం కలిగి ఉండేవారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వివిధ వేదికలపై తన వాగ్ధాటినే అస్త్రంగా మార్చుకొనే వారు. ప్రతిపక్షాలను ఎదుర్కొనే దగ్గరి నుంచి ప్రభుత్వ విధానాల్ని ప్రజలకు తెలియజేయడానికి ఆయన బ్లాగ్‌, ట్విటర్‌ను సమర్థంగా వినియోగించుకొనే వారు. హిందీ, ఆంగ్ల భాషల్లో సందర్భోచితంగా పదునైన పదాల్ని వాడుతూ అటు తన అభిమానులతో పాటు విమర్శకుల్ని సైతం మెప్పించేవారు. అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరడానికి కొన్ని రోజుల ముందు జమ్మూకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దుపై తన అభిప్రాయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించిన తీరు కొంతమంది వ్యతిరేకులనూ రాజీపడే స్థాయిలో ఉందంటే అతిశయోక్తి కాదు. సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శకులకు జైట్లీ దీటైన సమాధానం చెప్పిన కొన్ని సందర్భాలు...

వంశపారంపర్య రాజకీయాలపై..
వారసత్వ రాజకీయాలను జైట్లీ తీవ్రంగా వ్యతిరేకించేవారు. కొన్ని రాజకీయ పార్టీలు దెబ్బతినడానికి ఆ విధానమే కారణమని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ను ఆయన ఎప్పుడూ తప్పుబట్టేవారు. కుల రాజకీయాలు సైతం వ్యవస్థని భ్రష్టు పట్టిస్తాయని నమ్మేవారు. వీటి ఆధారంగా పనిచేస్తున్న పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనని అనేక సార్లు వ్యాఖ్యానించారు. 

జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తిపై...
ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. కాంగ్రెస్‌పై అరుణ్‌ జైట్లీ విరుచుకుపడ్డారు. 1947లో జమ్మూకశ్మీర్‌ భారత్‌లో విలీనం అయితే 1952, 1954లో వచ్చిన అధికరణ 370, 35ఏ విలీన షరతులు ఎలా అవుతాయని ఓ చారిత్రక సత్యాన్ని సందర్భోచితంగా గుర్తుచేశారు. కాంగ్రెస్‌ని ‘హెడ్‌లెస్‌ చికెన్‌’ అంటూ దుయ్యబట్టారు. ఈ సాహోసేపత నిర్ణయం తీసుకున్న అమిత్‌ షా, మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. శ్యామప్రసాద్‌ ముఖర్జీ కలల్ని నెరవేర్చారని కొనియాడారు. చారిత్రక తప్పిదాన్ని సరిచేశారని భాజపా ప్రభుత్వ కృషిని ప్రశంసించారు.  

స్మృతి ఇరానీకి దన్నుగా..
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతపై విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో అరుణ్‌జైట్లీ వాటిని దీటుగా తిప్పికొట్టారు. భాజపా నేతల విద్యాభ్యాసాన్ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్‌ విద్యార్హతల్ని బహిర్గతం చేయాలన్న జైట్లీ సమయస్ఫూర్తితో వివాదం దాదాపు సద్దుమణిగినట్లయింది. రాజకీయాలకు సేవా దృక్పథమే ముఖ్యమైన అర్హత అని భావించిన ఆయన ఇతర అర్హతలపై దృష్టి సారించాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పారు.

మోదీ వర్సెస్‌ గందరగోళం..
2019 సార్వత్రిక ఎన్నికల్ని జైట్లీ.. మోదీ వర్సెస్‌ గందరగోళంగా అభివర్ణించారు. కోల్‌కతాలో అప్పట్లో విపక్షాలు నిర్వహించిన మెగా ర్యాలీని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భిన్న అభిప్రాయాలు, లక్ష్యాలు ఉన్న పార్టీలు ఓ ఉమ్మడి కార్యాచరణ లేకుండా ఏకతాటిపైకి రావడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇది దేశ ప్రయోజనాలకే భంగం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. 

ఇలా అనేక సందర్భాల్లో జైట్లీ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. అందుకోసం సామాజిక మాధ్యమాల్ని సమర్థంగా వినియోగించుకొనేవారు. తను నమ్మిన సిద్ధాంతాల కోసం నిజాయతీగా పోరాడేవారు. కానీ అర్థవంతమైన విమర్శలకే పరిమితం అయ్యేవారు. ఏనాడూ సంయమనం కోల్పోలేదు. తన విమర్శల్లో ద్వేషపూరిత మాటలకు తావివ్వలేదు. బహుశా ఈ లక్షణమే పార్టీలకతీతంగా ఆయనకు అభిమానుల్ని సంపాదించి పెట్టింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.