Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000556
            [news_title_telugu_html] => 

ఆయన ప్రసంగాలు చిరస్మరణీయం..

[news_title_telugu] => ఆయన ప్రసంగాలు చిరస్మరణీయం.. [news_title_english] => leaders condolences on arun jaitley demise [news_short_description] => భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ తీవ్ర అనారోగ్యంలో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పార్టీలో ముఖ్య నేతగా ఎదిగిన జైట్లీ.. పార్టీలోని వివిధ హోదాల్లో, కేంద్ర మంత్రిగా కీలక పాత్ర పోషించారు........ [news_tags_keywords] => Arun Jaitley,BJP,Sonia gandhi,Smriti irani [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => Kwzh9IUBhz8 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 00:18:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆయన ప్రసంగాలు చిరస్మరణీయం.. - leaders condolences on arun jaitley demise - EENADU
close

తాజా వార్తలు

ఆయన ప్రసంగాలు చిరస్మరణీయం..

పార్టీలకతీతంగా అరుణ్‌ జైట్లీ మృతి పట్ల నేతల సంతాపం

ఇంటర్నెట్‌ డెస్క్‌: భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ తీవ్ర అనారోగ్యంతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పార్టీలో ముఖ్య నేతగా ఎదిగిన జైట్లీ.. పార్టీలోని వివిధ హోదాల్లో, కేంద్ర మంత్రిగా కీలక పాత్ర పోషించారు. అనారోగ్య కారణాలతో కొత్త కేబినెట్‌లో చేరడానికి విముఖత వ్యక్తం చేసిన ఆయన చివరకు తన అభిమానుల్ని, పార్టీ శ్రేణుల్ని కన్నీటి సంద్రంలో ముంచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన సేవలు చిరస్మరణీయం: సోనియా
కేంద్ర మంత్రిగా అరుణ్‌ జైట్లీ చేసిన సేవల్ని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొనియాడారు. ఆయన మరణం తనని తీవ్రంగా కలచివేసిందన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో దేశానికి ఎన్నో సేవల్ని అందించారన్నారు.

ఆయన ప్రసంగాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: గడ్కరీ
అరుణ్‌ జైట్లీ మరణ వార్తతో తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తన విచారాన్ని వ్యక్తం చేశారు. ‘ఆయన లేని లోటు పూడ్చలేనిది. రాజ్యసభలో ఆయన ప్రసంగాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇద్దరు పార్టీ ముఖ్య నేతలు ఒకరి తర్వాత ఒకరు ఈ లోకాన్ని వీడడం బాధాకరంగా ఉంది. సుష్మా మరణించిన కొన్ని రోజులకే జైట్లీ కన్నుమూయడం పార్టీకి, దేశానికి తీరని లోటు.’ 

దేశానికి, ఆరెస్సెస్‌కి ఎంతో చేశారు : కేంద్రమంత్రి  స్మృతి ఇరానీ
‘తన సేవలతో ఎంతో మందిని ఆదుకున్న గొప్ప నేత అరుణ్‌ జైట్లీ’. గొప్ప వాగ్ధాటి, న్యాయ సంబంధిత అంశాలపై అపార విజ్ఞానం ఆయన సొంతం. దేశం కోసం, ఆరెస్సెస్‌ కోసం ఎంతో అంకితభావంతో పని చేశారు.

గొప్ప పార్లమెంటేరియన్‌: మమతా బెనర్జీ
అరుణ్‌ జైట్లీ మరణ వార్త తీవ్రంగా బాధించిందని పశ్చిమ బెంగాల్‌  సీఎం మమతా బెనర్జీ
 తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘‘గొప్ప పార్లమెంటేరియన్‌. న్యాయకోవిదుడు. పార్టీలకతీతంగా అభిమానుల్ని సంపాదించున్నారు. భారత రాజకీయాలకు ఆయన చేసిన సేవలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’’.

పార్టీలకతీతంగా అనేక మంది నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అరుణ్‌జైట్లీ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.