Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000587
            [news_title_telugu_html] => 

జైట్లీ ‘అందరివాడు’..

[news_title_telugu] => జైట్లీ ‘అందరివాడు’.. [news_title_english] => we miss Arun jaitley contribution says Sumitra Mahajan [news_short_description] => కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ మృతిపై లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు...... [news_tags_keywords] => Arun Jaitely,BJP,Sumitra Mahajan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 00:18:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జైట్లీ ‘అందరివాడు’.. - we miss Arun jaitley contribution says Sumitra Mahajan - EENADU
close

తాజా వార్తలు

జైట్లీ ‘అందరివాడు’..

ఇండోర్‌: కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ మృతిపై లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటన్నారు. రాజకీయనేత గానే కాకుండా ఓ మంచి మనిషిగా ఆయన చేసిన సేవల్ని ఆమె కొనియాడారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటన్నారు. గత కొంత కాలంగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసిన అరుణ్‌ జైట్లీతో తనకు ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను ఆమె గుర్తుచేసుకున్నారు. 

అరుణ్‌ జైట్లీ అందంతో పాటు ఎంతో చురుగ్గా, తెలివితేటలతో వ్యవహరించేవారని అందుకే ఆయన్ను బ్లూ ఐ బర్డ్‌ అని తామంతా సరదాగా పిలిచేవాళ్లమన్నారు. ఆయన వెనుక అనేకమంది అమ్మాయిలు వెంటపడుతుంటే జైట్లీని ఆటపట్టించే వాళ్లమని గుర్తు చేసుకున్నారు.  అంశాల వారీగా ఆయన బ్రహ్మాండగా మాట్లాడేవారన్నారు. రాజకీయ పార్టీలు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఆయన అందరితోనూ స్నేహంగా మెలిగేవారంటూ జైట్లీ వ్యక్తిత్వాన్ని ఆమె కొనియాడారు.   న్యాయ, ఆర్థికపరమైన అంశాల్లో ఆయనకు అపార జ్ఞానం ఉందన్నారు. న్యాయపరమైన అంశాల్లో తాము ఆయన్నే సంప్రదించేవాళ్లమని చెప్పారు. అప్పగించిన ఏ బాధ్యతలనైనా ఆయన ఎంతో సమర్థతతో నిర్వహించారని సుమిత్రా మహాజన్‌ గుర్తుచేసుకున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.