Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001003
            [news_title_telugu_html] => 

సినిమా సన్నివేశాల్ని పూసగుచ్చినట్లు చెప్పేవారు

[news_title_telugu] => సినిమా సన్నివేశాల్ని పూసగుచ్చినట్లు చెప్పేవారు [news_title_english] => Didnt Learn Driving But Could Detail Even 60s Movie Scene ranjit kumar about jaitley [news_short_description] => తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన భాజపా కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ గురించి ఆయన మిత్రుడు మాజీ సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓరోజు దిల్లీలోని లోదీ గార్డెన్‌లో వాకింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా జైట్లీకి గుండెపోటు వచ్చిందట.............. [news_tags_keywords] => Arun jaitley,BJP,Ranjit kumar,Solicitor General [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 10:13:59 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సినిమా సన్నివేశాల్ని పూసగుచ్చినట్లు చెప్పేవారు - Didnt Learn Driving But Could Detail Even 60s Movie Scene ranjit kumar about jaitley - EENADU
close

తాజా వార్తలు

సినిమా సన్నివేశాల్ని పూసగుచ్చినట్లు చెప్పేవారు

దిల్లీ: తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన భాజపా కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ గురించి ఆయన మిత్రుడు మాజీ సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓరోజు దిల్లీలోని లోదీ గార్డెన్‌లో వాకింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా జైట్లీకి గుండెపోటు వచ్చిందట. దీంతో పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి రంజిత్‌ చికిత్స చేయించారట. ఆసుపత్రికి తొందరగా తీసుకెళ్లాలనే ఆతృతతో కారును రాంగ్‌ రూట్‌లో తీసుకెళ్లారట. చివరకు సమయానికి ఆసుపత్రికి చేరుకోవడంతో జైట్లీకి అప్పట్లో ప్రాణాపాయ ముప్పు తప్పిందని జైట్లీతో ఉన్న కొన్ని జ్ఞాపకాల్ని రంజిత్‌ గుర్తుచేసుకున్నారు. జైట్లీ మృతి పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జైట్లీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

జైట్లీతో ఉన్న మూడు దశాబ్దాల స్నేహంలో ఏరోజూ ఆయన సంయమనం కోల్పోవడం, ఆగ్రహానికి గురికావడం చూడలేదని రంజిత్‌ తెలిపారు. ‘‘1974లో దిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తొలిసారి ఆయన్ని(జైట్లీ) కలిశాను. ఒక్కసారి మాట్లాడితే మనం ఆయన మాయలో పడిపోతాం. ఎన్నో గొప్ప లక్షణాలు మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఆ గుణమే మనల్ని ఆయన చుట్టూ తిరిగేలా, నేర్చుకునేలా చేసేది. ఎంతో హాస్య చతురత ఉండేది. ఆయనకు డ్రైవింగ్ రాదు. ఆయనకు జ్ఞాపక శక్తి అమోఘం. 1960ల్లో వచ్చిన చిత్రాల్లోని సన్నివేశాలైనా సరే.. గుర్తుచేస్తే పూసగుచ్చినట్లు చెప్పేవారు. 2014లో సోలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ‘ఎప్పుడూ సహనం కోల్పోవద్దు’ అని మాత్రమే సూచించారు. కోపం వల్ల మనిషికి ఒనగూరేది ఏమీ లేదని ఆయన బలంగా నమ్మేవారు’’ అని జైట్లీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రంజిత్‌ ఆవేదనకు గురయ్యారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.