Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001142
            [news_title_telugu_html] => 

‘గగన్‌యాన్‌’ కోసం రష్యా సహకారం

[news_title_telugu] => ‘గగన్‌యాన్‌’ కోసం రష్యా సహకారం [news_title_english] => Russia Offered Semi Cryogenic Engine Technology for ISRO [news_short_description] => అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్‌-రష్యా పరస్ఫర సహకారం అందించుకొనే దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ఆదివారం తెలిపారు. రష్యా వద్ద ఉన్న సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ సాంకేతికతను భారత్‌ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ కోసం వినియోగించే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. [news_tags_keywords] => ISRO, Roscosmos, Semi-Cryogenic Engine Technology, Gaganyaan, NavIC [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 01:49:17 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘గగన్‌యాన్‌’ కోసం రష్యా సహకారం - Russia Offered Semi Cryogenic Engine Technology for ISRO - EENADU
close

తాజా వార్తలు

‘గగన్‌యాన్‌’ కోసం రష్యా సహకారం

ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ వెల్లడి

చెన్నై: అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్‌-రష్యా పరస్పర సహకారం అందించుకొనే దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ఆదివారం తెలిపారు. రష్యా వద్ద ఉన్న సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ సాంకేతికతను భారత్‌ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ కోసం వినియోగించే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. అంతేకాక ఈ ప్రయోగం కోసం ఆ దేశం నుంచి కొన్ని విడి భాగాలను దిగుమతి చేసుకొనే అంశం పరిశీలనలో ఉందని చెప్పారు.
‘‘కొన్ని అంశాల్లో సహకారం కోసం రష్యా అంతరిక్ష సంస్థతో చర్చలు జరుపుతున్నాం. కానీ ఇంతవరకూ చర్చలేవీ ఖరారు కాలేదు. భారత్‌ చేపట్టబోయే గగన్‌యాన్‌ ప్రాజెక్టు కోసం మన వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇచ్చే అంశంపై మాత్రం చర్చలు కొలిక్కి వచ్చాయి. అంతేకాక రష్యా భారత్‌కు సెమీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ సాంకేతికతను అందించనుంది. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ పరిజ్ఞానంతో రాకెట్‌ ఇంజిన్లు భారత్‌లోనే తయారవుతాయి. మరింత కచ్చితమైన ఉపగ్రహ నావిగేషన్‌ సిగ్నళ్ల కోసం రెండు దేశాలు తమ ప్రాంతాల్లో గ్రౌండ్‌ స్టేషన్లు నెలకొల్పే అంశంపైనా చర్చలు జరుగుతున్నాయి. నావిగేషన్‌ కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అందుబాటులోకి రానున్న ‘నావిక్‌’ వ్యవస్థ కోసం రష్యాలో గ్రౌండ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వారి శాటిలైట్‌ నావిగేషన్‌ వ్యవస్థ కోసం భారత్‌లో గ్రౌండ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇది బెంగళూరులో ఉండనుండగా, మన గ్రౌండ్‌ స్టేషన్‌ మాస్కోలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది.’’ అని శివన్‌ ఓ జాతీయ వార్తా సంస్థతో అన్నారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ కోసం కీలకమైన విడిభాగాలను  రష్యా నుంచి దిగుమతి చేసుకొనే అవకాశంపై ప్రశ్నించగా.. ‘‘దీనిపై చర్చలు ఇంకా జరుగుతున్నాయి. రష్యా నుంచి కొనుగోలు చేసే విడిభాగాలు మనకు ఉపయోగపడాల్సి ఉంటుంది. అప్పుడు దీని అవసరం గురించి పరిశీలిస్తాం.’’ అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఇస్రో దృష్టి మొత్తం చంద్రయాన్‌-2 పైనే ఉందని శివన్‌ స్పష్టం చేశారు.
వ్యోమ నౌకలను నడిపే పైలట్లు, ఉపగ్రహ నావిగేషన్‌, ఇంజిన్‌ సాంకేతికత తదితర అంశాల్లో సహకారం కోసం ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రొస్‌కోస్‌మాస్‌ కూడా ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.