Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001515
            [news_title_telugu_html] => 

సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు

[news_title_telugu] => సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు [news_title_english] => SC refuses to entertain P Chidambarams petition in corruption case lodged by CBI [news_short_description] => ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో అరెస్టయిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన [news_tags_keywords] => Chidambaram,INX Media Case,ED,CBI,Supreme court [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => https://www.facebook.com/ETVTelangana/videos/2567392103304881/ [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 12:33:58 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు - SC refuses to entertain P Chidambarams petition in corruption case lodged by CBI - EENADU
close

తాజా వార్తలు

సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు

దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో అరెస్టయిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పటికే చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేసినందున ఈ పిటిషన్‌ చెల్లదని కోర్టు వెల్లడించింది. 

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు గతవారం తోసిపుచ్చింది. ఈ కుంభకోణం మొత్తానికి చిదంబరమే ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు అర్థమవుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌పై తక్షణ విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో గత బుధవారం సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. 

అయితే అరెస్టు కంటే ముందే తాము ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశామని, అందువల్ల దానిపై విచారణ జరపాలని చిదంబరం తరఫు న్యాయవాది నేడు కోర్టుకు తెలిపారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. చిదంబరం అరెస్టైనందున ఇప్పుడు ఆ పిటిషన్‌కు అర్హత లేదని పేర్కొంది. 

మరోవైపు సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నందున కస్టడీ వ్యవహారంపై జోక్యం చేసుకోబోమని గతవారం న్యాయస్థానం స్పష్టం చేసింది. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. దీంతో అరెస్టు తర్వాత దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగాల్సి ఉండగా.. అది ఇంకా లిస్ట్‌ కాలేదని ధర్మాసనం వెల్లడించింది. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.