close

తాజా వార్తలు

వినాయక విగ్రహం తరలిస్తుండగా విషాదం

గుజరాత్‌: దేశమంతా వినాయక వేడుకలకు సిద్ధమవుతున్న వేళ గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. భారీ వినాయక ప్రతిమను తరలించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని బరోచి జిల్లాలో చోటుచేసుకుంది. గణపతి విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ తీగలు అడ్డంగా ఉండడంతో వాటిని తప్పించేందుకు యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యుదాఘాతం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గణనాథుని వేడుకులకు ముస్తాబవుతున్న వేళ ఈ విషాదం చోటుచేసుకోవడంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.