
తాజా వార్తలు
మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందనకు నిరాకరణ
దిల్లీ: జీఎస్టీ తగ్గింపు తన చేతుల్లో లేదని, దానిపై నిర్ణయం జీఎస్టీ మండలి తీసుకుంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదివారం చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై విలేకరులు ప్రశ్నించగా.. ‘‘కొంత మంది బ్యాంకు ఉద్యోగులు విలీనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ మేం బ్యాంకులను మూసివేయడం లేదు. ప్రస్తుతమున్న బ్యాంకులో వారు చేస్తున్న దానికి భిన్నంగా చేయమని మేం అడగడం లేదు. బ్యాంకులు పుంజుకొనేందుకు మేము వాటికి ఎక్కువ సామర్థ్యాన్ని ఇచ్చినట్లయింది.”అని సీతారామన్ అన్నారు.
మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందనకు నిరాకరణ
వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోవడంపై ఆదివారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన విమర్శలపై స్పందించాలని విలేకరులు కోరగా.. నిర్మలా సీతారామన్ అందుకు నిరాకరించారు. దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి మోదీ ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమని ఆదివారం ఉదయం మన్మోహన్ సింగ్ విమర్శించిన సంగతి తెలిసిందే. వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉన్నా.. నిర్వహణ లోపం వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో లోపాల ప్రభావం నుంచి దేశం ఇంకా కోలుకోలేదనేందుకు తాజా దుస్థితి నిదర్శనమని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మోదీ సర్కారు రాజకీయాలు పట్టించుకోకుండా ఆర్థిక మేధావుల్ని సంప్రదించాలని మన్మోహన్ సూచించారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- బంపర్ ఆఫర్ కొట్టేసిన షాలినీ పాండే
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- 2019లో గూగుల్‌లో అధికంగా సెర్చ్ చేసినవివే..
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
