close

తాజా వార్తలు

అణుయుద్ధంపై ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో భారత్‌- పాక్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం మొదటగా అణ్వాయుధాల్ని భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించబోదన్నారు. లాహోర్‌లోని సిక్కులకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..  ‘‘ఇరు దేశాలూ అణ్వాయుధాలు కలిగి ఉన్నవే. భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింతగా కొనసాగితే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది’’ అని వ్యాఖ్యానించారు. 

జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దుచేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్‌తో అణుయుద్ధానికి సిద్ధమేనని గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశానికి చెందిన కొందరు మంత్రులు కూడా పూటకో ప్రకటనలు చేస్తూ మరింతగా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.