close

తాజా వార్తలు

దసరా నాడు భారత్‌కు తొలి రఫేల్‌

అందుకోనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

దిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్‌ యుద్ధవిమానాలు త్వరలోనే వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి. అక్టోబరు 8న తొలి రఫేల్‌ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్‌ అధికారికంగా భారత్‌కు అప్పగించనుంది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దీన్ని అందుకోనున్నారు. ‘అక్టోబరు 8 చాలా మంచిరోజు. ఆ రోజు ఎయిర్‌ఫోర్స్‌ డేతో పాటు దసరా పండగ కూడా. అందువల్ల ఆ రోజే రఫేల్‌ను వాయుసేన అమ్ములపొదిలోకి అధికారికంగా తీసుకోవాలని భావించాం’ అని అధికారిక వర్గాలు తెలిపారు. రాజ్‌నాథ్‌తో పాటు రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌, ఇతర సీనియర్‌ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొగనున్నారు. 

అయితే అధికారిక కార్యక్రమం అక్టోబరులో జరిగినప్పటికీ రఫేల్‌ విమానాలు భారత్‌కు వచ్చేది మాత్రం వచ్చే ఏడాదిలోనే. రఫేల్‌లో భారత పైలట్లకు శిక్షణ ఇచ్చిన అనంతరం వాటిని ఇక్కడకు తీసుకురానున్నారు. తొలి విడతలో భాగంగా 2020 ఏప్రిల్‌-మే నాటికి నాలుగు రఫేల్‌ యుద్ధ విమానాలు మన వాయుసేన స్థావరాలకు చేరుకుంటాయి. 2022 సెప్టెంబరు నాటికి మొత్తం 36 విమానాలు భారత వాయుసేనలో చేరనున్నాయి. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.