Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009281
            [news_title_telugu_html] => 

మంచి భర్తగా ఉండాలి..

[news_title_telugu] => మంచి భర్తగా ఉండాలి.. [news_title_english] => Be a ‘great lover’: Supreme Court to Muslim man who married Hindu woman [news_short_description] => కులాంతర, మతాంతర వివాహాలకు తాము వ్యతిరేకం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కేవలం అమ్మాయి భవిష్యత్‌ మాత్రమే తమకు అంతిమమని పేర్కొంది. ఓ మతాంతర.... [news_tags_keywords] => Supreme Court,Muslim man,Hindu woman,Inter-Religious,Inter-Caste [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 20:48:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మంచి భర్తగా ఉండాలి.. - Be a ‘great lover’: Supreme Court to Muslim man who married Hindu woman - EENADU
close

తాజా వార్తలు

మంచి భర్తగా ఉండాలి..

దిల్లీ: కులాంతర, మతాంతర వివాహాలకు తాము వ్యతిరేకం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. కేవలం అమ్మాయి భవిష్యత్‌ మాత్రమే తమకు అంతిమమని పేర్కొంది. ఓ మతాంతర వివాహానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా బుధవారం సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ముస్లిం యువకుడు హిందూ యువతిని వివాహం చేసుకున్నాడు. అందుకోసం తన మతాన్ని మార్చుకున్నాడు. అయితే, యువతి కుటుంబం అందుకు అడ్డు చెప్పింది. హిందువుగా మారడాన్ని తప్పుబట్టింది. మతాంతర వివాహాల ముసుగులో ఓ రాకెట్‌ నడుస్తోందంటూ యువతి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తాము కులాంతర లేదా మతంతార వివాహాలకు వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టంచేసింది. తమ ఆందోళనంతా యువతి భవిష్యత్‌ కోసమేనని పేర్కొంది. వివాహం చేసుకున్న వ్యక్తి ఓ ‘మంచి ప్రేమికుడి’గా ‘మంచి భర్త’గా ఉండాలని సూచించింది. ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్న యువకుడికి తన పేరు మార్చుకునేందుకు కావాల్సిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతూ సెప్టెంబర్‌ 22కి తదుపరి విచారణను వాయిదా వేసింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.