Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009703
            [news_title_telugu_html] => 

లంచమివ్వలేదని గేదెను పట్టుకెళ్లారు

[news_title_telugu] => లంచమివ్వలేదని గేదెను పట్టుకెళ్లారు [news_title_english] => MP official asks for Rs 25000 bribe gets buffalo in return [news_short_description] => మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా సిరోంజ్‌కి ప్రాంతంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కొందరు అధికారుల లంచగొండి తనానికి పరాకాష్టగా నిలిచింది. స్థానిక నాయిబ్‌ ప్రాంతానికి చెందిన తహశీల్దారుకు లంచమివ్వలేదని ఓ వ్యక్తికి చెందిన గేదెను కారుకు కట్టేసి తీసుకెళ్లారు......... [news_tags_keywords] => Madhya pradesh,Bribe [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 11:05:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
లంచమివ్వలేదని గేదెను పట్టుకెళ్లారు - MP official asks for Rs 25000 bribe gets buffalo in return - EENADU
close

తాజా వార్తలు

లంచమివ్వలేదని గేదెను పట్టుకెళ్లారు

మధ్యప్రదేశ్‌లో తహశీల్దార్‌ నిర్వాకం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా సిరోంజ్‌కి ప్రాంతంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కొందరు అధికారుల లంచగొండితనానికి ఇది పరాకాష్టగా నిలిచింది. స్థానిక నాయిబ్‌ ప్రాంతానికి చెందిన తహశీల్దారుకు లంచమివ్వలేదని ఓ వ్యక్తికి చెందిన గేదెను కారుకు కట్టేసి తీసుకెళ్లారు. 

తమ భూమికి సంబంధించిన వివరాలు చెప్పాల్సిందిగా భూపేంద్ర అనే వ్యక్తి ఆరు నెలలుగా నాయిబ్‌ తహశీల్దార్‌ సిద్ధార్థ్‌ సింఘాల్‌ చుట్టూ తిరుగుతున్నాడు. ఎంతకీ తహశీల్దార్‌ పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన భూపేంద్ర..సింఘాల్‌ను నిలదీశాడు. రూ.25,000 లంచమిస్తేనే తన పని జరుగుతుందని తహశీల్దార్‌ చెప్పాడు. అంతడబ్బు కట్టే స్థోమత తనకు లేదని, ఎలాగోలా తన పనిచేసిపెట్టాలని భూపేంద్ర ఆయన్ను వేడుకున్నాడు. లంచానికి బదులుగా బాధితుడి ఇంట్లో ఉన్న గేదెను తహశీల్దార్ తన కారుకు కట్టేసుకుని తీసుకెళ్లాడు. ఈ చర్యతో తీవ్ర దుమారం రేగింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, భూపేంద్ర తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని, తాను గేదెను తీసుకెళ్లలేదని తహశీల్దార్‌ ఆరోపించాడు. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సింఘాల్‌కు నోటీసులు జారీ చేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.