Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009721
            [news_title_telugu_html] => 

ఎన్నికల బరిలో రెజ్లర్‌ బబితా!

[news_title_telugu] => ఎన్నికల బరిలో రెజ్లర్‌ బబితా! [news_title_english] => Wrestler Babita Phogat may contest in Haryana polls [news_short_description] => మరి కొన్ని రోజుల్లో  హరియాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ప్రముఖ రెజ్లర్‌ బబితా ఫొగట్‌ దిగనున్నట్లు తెలుస్తోంది. గతనెలలో ఈమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సమక్షంలో బబిత, ఆమె తండ్రి మహావీర్‌ సింగ్ ఫొగట్‌ కాషాయం కండువా కప్పుకొన్నారు.......... [news_tags_keywords] => Haryana ,Babita Phogat,BJP [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 15:09:43 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎన్నికల బరిలో రెజ్లర్‌ బబితా! - Wrestler Babita Phogat may contest in Haryana polls - EENADU
close

తాజా వార్తలు

ఎన్నికల బరిలో రెజ్లర్‌ బబితా!

చండీగఢ్‌: ప్రముఖ రెజ్లర్‌ బబితా ఫొగట్‌ మరికొన్ని రోజుల్లో  హరియాణాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గతనెలలో ఈమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు సమక్షంలో బబిత, ఆమె తండ్రి మహావీర్‌ సింగ్ ఫొగట్‌ భాజపాలో చేరారు. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇందుకోసం ఆమె పోలీస్‌ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేశారు. ఇటీవలే తన ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. హరియాణా పోలీసుశాఖ కూడా ఆమె రాజీనామాను ఆమోదించింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆమె బార్దా లేదా చార్ఖీ నుంచి పోటీ చేసే అవకాశముంది.

కశ్మీర్‌ అమ్మాయిల గురించి హరియణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె ఖట్టర్‌కు మద్దతు పలికారు.  కశ్మీర్‌ నుంచి కూడా అందమైన అమ్మాయిలను కోడళ్లుగా తెచ్చుకోవచ్చన్న ఆయన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని బబిత ట్వీట్‌ చేశారు. అంతకు ముందు కశ్మీర్‌కు ఆర్టికల్‌ 370 రద్దుపైనా ఆమె స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భాజపా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఖట్టర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పారదర్శకంగా పనిచేస్తోందని ట్వీట్‌ చేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.