Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009729
            [news_title_telugu_html] => 

ఆనంద్‌ మహీంద్రా ట్వీట్.. ఇడ్లీ బామ్మకు గ్యాస్‌

[news_title_telugu] => ఆనంద్‌ మహీంద్రా ట్వీట్.. ఇడ్లీ బామ్మకు గ్యాస్‌ [news_title_english] => Anand Mahindra spotted idli vendor Gets LPG Connection From BPCL [news_short_description] => రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతున్న ‘ఇడ్లీ బామ్మ’ కమలాత్తాళ్‌కు తాజాగా వంట గ్యాస్‌ కనెక్షన్‌ లభించింది. అది కూడా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చలవతో [news_tags_keywords] => Anand Mahindra,Kamalathal,Idli [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 12:35:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆనంద్‌ మహీంద్రా ట్వీట్.. ఇడ్లీ బామ్మకు గ్యాస్‌ - Anand Mahindra spotted idli vendor Gets LPG Connection From BPCL - EENADU
close

తాజా వార్తలు

ఆనంద్‌ మహీంద్రా ట్వీట్.. ఇడ్లీ బామ్మకు గ్యాస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతున్న ‘ఇడ్లీ బామ్మ’ కమలాత్తాళ్‌కు తాజాగా వంట గ్యాస్‌ కనెక్షన్‌ లభించింది. అది కూడా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చలవతో. వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని పేరూరుకు చెందిన 80ఏళ్ల కమలాత్తాళ్‌ గత కొన్నేళ్లుగా రూపాయికే నాలుగు ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్నారు. రోజుకు వెయ్యి ఇడ్లీల వరకు అమ్ముతూ పేద జీవితాలకు తనవంతు సాయం చేస్తున్నారు. ఈ ఇడ్లీ బామ్మ గురించి ఇటీవల పలు మీడియా కథనాల్లో వార్తలు వచ్చాయి. సాధారణంగా ట్విటర్‌లో ఎంతో చురుగ్గా ఉండే పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ బామ్మ గురించి ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఆమెకు ఆర్థికసాయం చేసేందుకు ముందుకొచ్చారు. 

‘కమలాత్తాళ్‌ లాంటి మంచి వ్యక్తి గురించి తెలిసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను గమనించిన మరో విషయం ఏంటంటే.. ఆమె ఇప్పటికీ కట్టెలపొయ్యి మీదే వంట చేస్తున్నారు. ఆమె గురించి ఎవరికైనా తెలిస్తే.. తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు, ఆమెకు వంటగ్యాస్‌ కొనిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ చేసిన మరుసటి రోజే భారత్‌ గ్యాస్‌ కొయంబత్తూర్‌ విభాగం కమలాత్తాళ్‌కు వంటగ్యాస్‌ కనెక్షన్‌ అందించింది. ఈ విషయాన్ని మహీంద్రాకు ట్యాగ్‌ చేస్తూ భారత్‌గ్యాస్‌ ట్వీట్‌ చేసింది.

ఈ విషయం తెలిసి ఆనంద్‌ మహీంద్రా ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇది అద్భుతం. కమలాత్తాళ్‌కు ఆరోగ్యకరమైన కానుక ఇచ్చినందుకు భారత్‌ గ్యాస్‌ కొయంబత్తూర్‌ విభాగానికి కృతజ్ఞతలు. ఆమెకు ఆర్థికంగా అండగా ఉంటానని ఇదివరకే చెప్పానుగా.. ఇక మీదట ఆమె వంటగ్యాస్‌కు అయ్యే ఖర్చును నేను భరిస్తాను’ అని మహీంద్రా మరో ట్వీట్‌ చేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.