Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009746
            [news_title_telugu_html] => 

ప్చ్‌.. టాప్‌ 300 విద్యాసంస్థల్లో మనం లేం

[news_title_telugu] => ప్చ్‌.. టాప్‌ 300 విద్యాసంస్థల్లో మనం లేం [news_title_english] => No indian institute in worlds top 300 [news_short_description] => ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ 300 అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఈ సారి భారత్‌ నుంచి ఏ ఒక్క ఇనిస్టిట్యూట్‌ చోటు దక్కించుకోలేకపోయింది. టాప్‌ 300లో భారత విద్యాసంస్థలు లేకపోవడం 2012 తర్వాత [news_tags_keywords] => Times Higher Education,Rankings,Indian Institutes,IISC Bengaluru [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 14:12:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్చ్‌.. టాప్‌ 300 విద్యాసంస్థల్లో మనం లేం - No indian institute in worlds top 300 - EENADU
close

తాజా వార్తలు

ప్చ్‌.. టాప్‌ 300 విద్యాసంస్థల్లో మనం లేం

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ 300 అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఈ సారి భారత్‌ నుంచి ఏ ఒక్క ఇనిస్టిట్యూట్‌ చోటు దక్కించుకోలేకపోయింది. టాప్‌ 300లో భారత విద్యాసంస్థలు లేకపోవడం 2012 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

2020 సంవత్సరానికి గానూ టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థల ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలోని తొలి 300ల్లో భారత్‌ నుంచి ఒక్క ఇనిస్టిట్యూట్‌ కూడా లేదు. గతేడాది టాప్‌-300లో చోటు దక్కించుకున్న ఏకైక భారత విద్యాసంస్థ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) బెంగళూరు కూడా ఈ సారి 301-350 ర్యాంక్‌ గ్రూప్‌కు పడిపోయింది. మరో విద్యాసంస్థ ఐఐటీ-రోపర్‌ కూడా 301-350 గ్రూప్‌లో చోటుదక్కించుకుంది. ఇక ఐఐటీ ఇండోర్‌ 351-400 ర్యాంక్‌ గ్రూప్‌లో ఉంది. ఐఐటీ ముంబయి, దిల్లీ, ఖరగ్‌పూర్‌ విద్యాసంస్థలు 401-500 ర్యాంక్‌ గ్రూప్‌లో చోటు దక్కించుకున్నాయి.

ఇక వరుసగా నాలుగోసారి ఆక్స్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి రెండో ర్యాంక్‌ రాగా.. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ, మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.