Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009778
            [news_title_telugu_html] => 

మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీంకోర్టు

[news_title_telugu] => మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీంకోర్టు [news_title_english] => SC condemns UP Ministers Remarks on Top Court [news_short_description] => అయోధ్యలోని వివాదాస్పద భూమి కేసులో ఉత్తర్‌ ప్రదేశ్‌ మంత్రి గతంలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘సుప్రీంకోర్టు మనదైనంత కాలం అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించే బాధ్యత భాజపాదే. మా పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుంది’’ అని యూపీ మంత్రి ముకుత్‌ బిహారీ వర్మ గతేడాది వ్యాఖ్యానించారు. [news_tags_keywords] => UP, Supreme Court, Criticise, Mukut Bihari Verma, Ayodhya [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 20:50:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీంకోర్టు - SC condemns UP Ministers Remarks on Top Court - EENADU
close

తాజా వార్తలు

మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీంకోర్టు

ఆయోధ్య కేసు విచారణ సందర్భంగా అసంతృప్తి

దిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద భూమి కేసులో ఉత్తర్‌ ప్రదేశ్‌ మంత్రి గతంలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘సుప్రీంకోర్టు మనదైనంత కాలం అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించే బాధ్యత భాజపాదే. మా పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుంది’’ అని యూపీ మంత్రి ముకుత్‌ బిహారీ వర్మ గతేడాది వ్యాఖ్యానించారు. గురువారం అయోధ్య కేసులో విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడకుండా ఉండాల్సింది. వీటిని మేం తీవ్రంగా తప్పుపడుతున్నాం.’’ అని వ్యాఖ్యానించారు. 
అయోధ్య భూమి వివాదంలో 22వ రోజు వాదనలు వింటున్న వేళ ముస్లిం పార్టీల తరపున న్యాయవాది, నిరసనకారుడైన రాజీవ్‌ ధావన్‌ గతంలో మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడంతో ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. అంతేకాక తమ బృందానికి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. వారం క్రితం ఫేస్‌బుక్‌లో ఓ బెదిరింపు మెసేజ్‌ వచ్చిందని, ‘నీ సంగతి కోర్టు బయట చూసుకుంటాం’ అని సందేశ సారాంశమని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తామని కోర్టు చెప్పగా దాన్ని రాజీవ్‌ నిరాకరించారు. ఇరు వర్గాలు ఎలాంట భయం లేకుండా వాదనలు వినిపించుకోవచ్చని ధర్మాసనం తెలిపింది.
గతేడాది సెప్టెంబరులో మంత్రి ముకుత్‌ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక భాజపా రామ మందిరం నిర్మిస్తుందని, ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నా, అది కూడా మనదేనని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ, పాలనా యంత్రాంగం అన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌ కావడంతో సదరు మంత్రి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత వివరణ ఇచ్చిన ఆయన సుప్రీంకోర్టు మనది అంటే అంటే 125 కోట్ల భారతీయులదని, భాజపాకో, వ్యక్తిగతంగా తనకో చెందినది కాదని అన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.