Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009787
            [news_title_telugu_html] => 

అవును.. ఉగ్రవాదులకు వందల కోట్లు ఇచ్చాం..

[news_title_telugu] => అవును.. ఉగ్రవాదులకు వందల కోట్లు ఇచ్చాం.. [news_title_english] => Pak Has Spent Millions On Terror Group Jamat ud Dawa Admits Minister [news_short_description] => పాకిస్థాన్‌ అంతర్జాతీయ ఉగ్రవాదానికి పురిటిగడ్డ అన్నది అందరికి తెలిసిన విషయమే. అయితే పాకిస్థాన్‌  ఇంటీరియర్‌ మంత్రి  బ్రిగేడియర్‌ ఇజాజ్‌ అహ్మద్‌ షా ఈ విషయాన్ని అంగీకరించడం విశేషం. [news_tags_keywords] => pakistan,spent money,terrorists,brigadiar ahmed ejaj shah,pak minister [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-13 00:24:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అవును.. ఉగ్రవాదులకు వందల కోట్లు ఇచ్చాం.. - Pak Has Spent Millions On Terror Group Jamat ud Dawa Admits Minister - EENADU
close

తాజా వార్తలు

అవును.. ఉగ్రవాదులకు వందల కోట్లు ఇచ్చాం..

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ అంతర్జాతీయ ఉగ్రవాదానికి పురిటిగడ్డ అన్నది అందరికి తెలిసిన విషయమే. అయితే పాకిస్థాన్‌  ఇంటీరియర్‌ మంత్రి  బ్రిగేడియర్‌ ఇజాజ్‌ అహ్మద్‌ షా ఈ విషయాన్ని అంగీకరించడం విశేషం.  పాక్‌లోని ఒక ప్రైవేటు ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ  నిషేధిత ఉగ్రవాద సంస్థ జమత్‌-ఉద్‌-దవాకు చెందిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం వేల కోట్ల నిధులను కేటాయించిందని  అన్న సంగతిని బయటపెట్టారు.

ఇమ్రాన్‌ఖాన్‌ పాలన దేశాన్ని నాశనం చేస్తోంది..
పాక్‌ను పాలిస్తున్ననేతల తీరుతో దేశం భ్రష్టు పడుతోందని ఆయన విమర్శించారు.  జమ్మూకశ్మీర్‌ అంశం గురించి అంతర్జాతీయ వేదికపై పాక్‌ ఏం చెప్పినా ఎవరూ నమ్మడం లేదని దీనికి గత పాలకులైన బెనజీర్‌ భుట్టో, ముషారఫ్‌తో పాటు ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కూడా కారణమని ఆరోపణలు గుప్పించారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కలిగిస్తున్న ఆర్టికల్‌ 370ను భారత ప్రభుత్వం రద్దు చేయడంతో దాన్ని వివాదం చేసేందుకు పాక్‌ విశ్వయత్నాలు చేస్తోంది. అయితే ఏ ఒక్క దేశమూ పాక్‌ చెప్పే కబుర్లను విశ్వసించడం లేదు. దీంతో  పాటు కశ్మీర్‌ సమస్య పరిష్కారం భారత్‌-పాక్‌లు ద్వైపాక్షిక చర్చల్లో తేల్చుకోవాలని సూచించాయి. దీన్ని జీర్ణించుకోలేని పాక్‌ భారత్‌లోకి ఉగ్రవాదులను దొంగచాటుగా పంపేందుకు యత్నిస్తోంది. అయితే భారత దళాలు సమర్థవంతంగా అడ్డుకోవడంతో ఏం చేయాలో పాక్‌కు మింగుడు పడటం లేదు. 

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.