Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009814
            [news_title_telugu_html] => 

కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రవేశరుసుము 20 డాలర్లు

[news_title_telugu] => కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రవేశరుసుము 20 డాలర్లు [news_title_english] => Pak Charges 20 Dollers for pilgrims to Gurdwara Sahib Kartarpur [news_short_description] => కర్తార్‌పూర్‌ కారిడార్‌ ద్వారా గురుద్వారా సాహిబ్‌ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వచ్చే యాత్రికులకు 20 డాలర్ల రుసుము (రూ.1,400) విధించనున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది. ఒక్కో యాత్రికుడు 20 డాలర్లు సేవా రుసుం చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఇది ప్రవేశ రుసుము కాదని పాక్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ తెలిపారు. [news_tags_keywords] => Kartarpur corridor, Dera Baba Nanak, USD 20, Gurdwara Sahib [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 19:35:42 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రవేశరుసుము 20 డాలర్లు - Pak Charges 20 Dollers for pilgrims to Gurdwara Sahib Kartarpur - EENADU
close

తాజా వార్తలు

కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రవేశరుసుము 20 డాలర్లు

కర్తార్‌పూర్‌ యాత్రికుల నుంచి వసూలుకు పాక్‌ నిర్ణయం

ఇస్లామాబాద్‌: కర్తార్‌పూర్‌ కారిడార్‌ ద్వారా గురుద్వారా సాహిబ్‌ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వచ్చే యాత్రికులకు 20 డాలర్ల రుసుము (రూ.1,400) వసూలు చేయనున్నట్టు పాకిస్థాన్‌ ప్రకటించింది. ఒక్కో యాత్రికుడు 20 డాలర్లు సేవా రుసుం చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఇది ప్రవేశ రుసుము కాదని పాక్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ తెలిపారు. కారిడార్‌ నిర్మాణం కోసం చేస్తున్న ఖర్చు, యాత్రికుల సౌకర్యార్థం నిర్వహణ ఖర్చులను కొంత మేర పూడ్చుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 
ఈ నెల ప్రారంభంలో కార్తార్‌పూర్‌ కారిడార్‌పై భారత్‌-పాక్‌ ఉన్నతాధికారుల మధ్య కొన్ని కీలక అంశాల్లో జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. పాక్‌ రుసుములు వసూలు చేయడం ఏమాత్రం సరికాదని భారత హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రయాణికులకు ఉచిత దర్శనం కల్పించాలని పాక్‌ అధికారులను కోరినా వారు అందుకు అంగీకరించలేదన్నారని చెప్పారు. అయితే, వీసా లేకుండా పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు స్పష్టం చేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.