close

తాజా వార్తలు

సుదూరపు గ్రహంపై నీటి జాడ

లండన్‌: మన భూగోళాన్ని పోలిన మరో గ్రహంపై నీటి జాడ ఉన్నట్టు లండన్‌ విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. అక్కడ జీవుల మనుగడకు అనుకూలమైన ఉష్ణోగ్రతలు ఉన్నట్టు అంచనాకు వచ్చారు. మన సౌర వ్యవస్థకు ఆవల, భూమికి 110 కాంతి సంవత్సరాల దూరాన ఈ గ్రహముంది. ‘‘భూమికంటే 2.5 రెట్లు పెద్దదైన కె2-18బి అనే ఈ గ్రహంపై మైనస్‌ 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఓ చిన్న నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతోంది. అక్కడి వాతావరణంలో నీటి ఆవిరితో పాటు హైడ్రోజన్‌, హీలియం ఉన్నాయి. మీథేన్‌, నైట్రోజన్‌లు కూడా ఉండే అవకాశముంది.’’ అని ప్రధాన పరిశోధకుడు ఏంజెలోస్‌ సియరాస్‌ తెలిపారు. అయితే... కె2-18బి జీవనయోగ్య గ్రహం కాకపోవచ్చని మరికొందరు పరిశోధకులు అంటున్నారు. భూమిని పోలిన గ్రహాలు విశ్వంలో మరెన్నో ఉన్నట్టు ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చినా... మరో గ్రహంపై నీటి జాడ, జీవన యోగ్య పరిస్థితులు ఉన్నట్టు గుర్తించడం మాత్రం ఇదే తొలిసారి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.