close

తాజా వార్తలు

లాడెన్‌ కొడుకు మృతి వాస్తవమే..

ధ్రువీకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌: అల్‌-ఖైదా ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ కుమారుడు హమ్జా బిన్‌ లాడెన్‌ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధ్రువీకరించారు. అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో అమెరికా సైన్యం చేపడుతున్న ఉగ్రవాద నిరోధక చర్యల్లో అతను హతమైనట్లు ట్రంప్‌ చెప్పారు. ఈ మేరకు ట్రంప్‌ వ్యాఖ్యలతో కూడిన ఓ ప్రకటనను శ్వేత సౌధం విడుదల చేసింది. గత రెండేళ్లుగా జరుగుతున్న అమెరికా మిలిటరీ ఆపరేషన్‌లో హమ్జా బిన్‌ లాడెన్‌ చనిపోయాడని గత ఆగస్టులో అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, ఈ విషయం తమకు నిఘా వర్గాల ద్వారా అందిందని పేర్కొన్నాయి. 

హమ్జద్‌ మృతి చెందాడని తాను బలంగా నమ్ముతున్నట్లు గత నెలలో అమెరికా రక్షణశాఖ సెక్రటరీ మార్క్‌ ఎస్పర్‌ ఓ సందర్భంలో తెలిపారు. కానీ ట్రంప్‌, ఇతర అధికారులెవరూ ఈ వార్తను అప్పుడు ధ్రువీకరించలేదు.

లాడెన్‌కు ఉన్న మొత్తం 20 మంది సంతానంలో హమ్జా 15వ వాడు. ఇతను లాడెన్‌ మూడో భార్యకు జన్మించాడు. దాదాపు 30 ఏళ్లు ఉంటాయని సమాచారం. తన తండ్రి స్థానంలో అల్‌-ఖైదా నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరేవాడు. లాడెన్‌ మట్టుబెట్టిన అమెరికాపై పగ సాధిస్తానని అంటుండేవాడని అంతర్జాతీయ మీడియాలో కొద్ది నెలల క్రితం కథనాలు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో హమ్జాద్‌ను పట్టించిన వారికి 1 మిలియన్‌ డాలర్ల బహుమానం ఇస్తామని అమెరికా గత ఫిబ్రవరిలో ప్రకటించింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.