close

తాజా వార్తలు

మీ దార్శనికత.. మాకు స్ఫూర్తిదాయకం

ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు సహా సామాన్యులు సైతం ట్విటర్‌ వేదికగా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  

* ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని, మరింత ఎక్కువ కాలం ఈ దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

* భారత ప్రధాని నరేంద్ర భాయ్‌ మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. సమర్థవంతమైన ఆయన నాయకత్వంలో మన దేశం అభివృద్ధి పథాన పురోగమిస్తోంది. ఆయన నిర్దేశకత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలు.. వేగవంతమైన అభివృద్ధితో పాటు భారత్‌ను ప్రపంచ యువనికపై బలమైన దేశంగా నిలబెట్టాయి. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

* దృఢసంకల్సం, నిర్ణాయక నేతృత్వం, అకుంఠిత దీక్ష కలిగిన మన ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు. మీ నేతృత్వంలో భారత్‌ ప్రపంచ వేదికపై బలమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన దేశంగా గుర్తింపు పొందింది - కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

* ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దార్శనిక నాయకత్వంలో భారత్‌ సరికొత్త శిఖరాలకు చేరుకుంది. ప్రపంచ దేశాల్లో భారత స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా - కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

* ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు - పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ

* ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా - కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ

* ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. మరింత ఎక్కువ కాలం ఈ దేశానికి సేవల అందించాలని ఆకాంక్షిస్తున్నా - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

* గౌరవనీయ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రతినిత్యం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, మరింతకాలం ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నా - తెలంగాణ మంత్రి కేటీఆర్‌

* ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

* హ్యాపీ బర్త్‌డే మోదీజీ. ఆరోగ్య, స్వచ్ఛ భారత్‌ కోసం మీ దార్శనికత మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం - సచిన్‌ తెందూల్కర్‌


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.