close

తాజా వార్తలు

వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం!

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగరంలో పలు వీధుల్లో గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి కాల్పులకు తెగబడ్డట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలం శ్వేతసౌధానికి కొద్ది దూరంలోని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డట్లు సమాచారం. గాయపడ్డవారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సులు ఘటనా స్థలికి చేరుకున్న చిత్రాలను స్థానికులు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అక్కడి స్థానిక వార్తా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన గురువారం రాత్రి కొలంబియా రోడ్డు 14వ వీధిలో జరిగింది. ఈ ఘటనను ఇంకా అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.