close

తాజా వార్తలు

పాప్‌ అప్‌ సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో పాప్‌ అప్‌ కెమెరాతో సరికొత్త ఫోన్‌ను శుక్రవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. వివో వి17 ప్రో పేరిట ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో మొత్తం ఆరు కెమెరాలున్నాయి. వీటిలో ముందు భాగంలో 32+8 మెగాపిక్సెల్‌ పాప్‌అప్‌ సెల్ఫీ కెమెరాలు, వెనుక వైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. అందులో మొదటిది 48 మెగాపిక్సల్‌ సోనీ ఐఎంఎక్స్‌ 582 సెన్సర్‌ కాగా.. 13 ఎంపీ టెలీఫొటోలెన్స్‌, 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, పోర్ట్రెయిట్‌ ఫొటోస్‌ కోసం 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ను వినియోగించారు.

8జీబీ ర్యామ్‌+ 128 జీబీ స్టోరేజ్‌ ఉన్న ఈ మొబైల్ ప్రారంభ ధరను రూ.29,990గా కంపెనీ నిర్ణయించింది. ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌, క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌ను వినియోగించారు. ఈ ఫోన్‌లో 6.44 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌, డార్క్‌మోడ్ ఫీచర్స్‌‌ ఉన్నాయి. ఫోన్‌ వెనక భాగంలో  గొరిల్లా గ్లాస్‌ 6 ప్రొటెక్షన్‌ అందిస్తున్నారు. 4,100 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 18W ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. సెల్ఫీ కెమెరాలో నైట్ మోడ్‌, మూన్‌ లైట్‌ మోడ్‌లు ఉన్నాయి. ఇందులో ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ లేకపోవడం గమనార్హం.

మిడ్‌ నైట్‌ ఓషన్‌, గ్లాసియర్‌ ఐస్‌ రంగుల్లో ఈ ఫోను లభ్యం కానుంది. సెప్టెంబర్‌ 27 నుంచి వివో ఈ-షాప్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, పేటీఎం మాల్, టాటా క్లిక్‌ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ప్రారంభ ఆఫర్ కింద హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలుపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తున్నారు. వీటితోపాటు ఉచిత స్క్ర్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.