close

తాజా వార్తలు

హౌడీ మోదీ!: ముందు ఎవరు మాట్లాడతారంటే..

హ్యూస్టన్‌ (అమెరికా) : ప్రపంచ ఎనర్జీ క్యాపిటల్‌ అయిన హ్యూస్టన్‌ నగరంలో మరికొద్ది గంటల్లో ‘హౌదీ మోదీ!’ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఇందులో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తొలిసారి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. దాదాపు 72వేల మంది ప్రత్యక్షంగా వీక్షించగల సామర్థ్యమున్న హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్‌ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. అయితే దాదాపు 50 వేల మందికి పైగా భారతీయ అమెరికన్‌లు ఈ కార్యక్రమానికి హాజరవుతుండడం, సుమారు 600 సంస్థలు కలిసి దీన్నినిర్వహిస్తుండడంతో హౌదీ మోదీ కార్యక్రమం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఇద్దరు అగ్ర నేతలు ఒకే వేదిక పంచుకోనున్న నేపథ్యంలో ముందుగా ఎవరు ప్రసంగిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

ఈ అంశంపై స్పష్టత లేకపోయినా తొలుత ట్రంప్‌ మాట్లాడతారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ మెగా కార్యక్రమంలో ట్రంప్‌ 30 నిమిషాలపాటు భారత్‌ను, భారతీయ అమెరికన్లనుద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. శనివారం వైట్‌హౌస్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ట్రంప్‌ ఈ మెగా కార్యక్రమం కోసం 100 నిమిషాల సమయం వెచ్చించనున్నారు. ప్రధాని మోదీ మాట్లాడే సమయంలో కూడా ట్రంప్‌ అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘‘అమెరికా, భారత్‌ మధ్య బలమైన బంధం ఉందని చాటి చెప్పేందుకు హౌడీ మోదీ కార్యక్రమం ఓ గొప్ప వేదిక. ప్రపంచంలోనే అతి పురాతన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకోనున్నాయి. అంతేకాక ఎనర్జీ, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు జరగనున్నాయి.’’ అని వైట్‌హౌస్‌ శనివారం నాటి ప్రకటనలో వివరించింది.

2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి అయిన ట్రంప్‌ భారత్‌ను మంచి మిత్ర దేశంగా మార్చుకుంటానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. ఇప్పుడు హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరుకావడం ద్వారా ట్రంప్‌ వేల మంది భారతీయ అమెరికన్ల మనసులు గెల్చుకోనున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికలకు ఇది బాగా కలిసిరానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.