close

తాజా వార్తలు

అతడికి ముగ్గురు భార్యలు.. 15 మంది పిల్లలు!


లఖ్‌నవూ: దేశంలో జనాభా విస్పోటనంతో ఆందోళన చెందుతున్న ప్రభుత్వాలు దాని నియంత్రణకు అనేక ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు వినూత్న అవగాహన కార్యక్రమాలూ నిర్వహిస్తూ వస్తున్నాయి. ఒక్క బిడ్డతో సరిపెట్టుకుంటున్న కుటుంబాలకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లో మాత్రం పిల్లలు దేవుడు ఇచ్చిన వరమని విశ్వసిస్తూ కుటుంబ నియంత్రణ పాటించడంలేదు. ఈ తరుణంలో ఓ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బౌధిరియన్‌ కలాన్‌ గ్రామంలో మహ్మద్‌ షరీఫ్‌ అనే వ్యక్తి ఏకంగా మూడు వివాహాలు చేసుకొని 15 మంది పిల్లలకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 6వేల జనాభా ఉన్న ఆ గ్రామంలో ఇదే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబం. జిల్లాలో తనదే ‘అతి పెద్ద కుటుంబం’ అని గర్వంగా చెప్పుకోవడంలో ముందుంటాడు షరీఫ్‌. వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ అయిన అతడు‌.. పిల్లలు తనకు దేవుడిచ్చిన వరమని.. ఇంకా ఎక్కువ మందిని ఇచ్చినా తాను సంతోషిస్తానంటున్నాడు. తన కుటుంబం గురించి షరీఫ్‌ ఇలా చెప్పుకొచ్చాడు..

‘‘నాకు 14 ఏళ్ల వయస్సులోనే తొలి వివాహం జరిగింది. 1987లో జట్టా బేగంను పెళ్లాడా. ముగ్గురు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు పుట్టారు. ఆ తర్వాత నూర్‌తో పరిచయం ఏర్పడింది. 1990లలో ఆమెను వివాహం చేసుకున్నా. ఆమె కూడా ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలకు జన్మనిచ్చింది. 2000లో నేపాల్‌కు చెందిన తరన్నం బేగంను వివాహం చేసుకున్నా. ఆమెకు ఒక కొడుకు, కూతురు పుట్టారు’’ అని వివరించాడు. అయితే, తనకు పుట్టిన పిల్లల పేర్లు ఏమీ తనకు గుర్తులేవని అతడు అంగీకరించడం విశేషం. సాయంత్రమైతే అంతా ఇంట్లో ఉన్న సమయంలో లెక్కబెడతానని తెలిపాడు. అతడి సంతానంలో గరిష్ఠ వయస్సు ఉన్న 24 ఏళ్ల కుమారుడు ఉండగా.. 2ఏళ్ల కనిష్ఠ వయస్సున్న కుమార్తె ఉన్నట్టు వివరించాడు. దేవుడు తనకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడనీ.. తామంతా కలిసి ఉన్నప్పటికీ పిల్లలు గానీ, భార్యలు గానీ ఒకరితో మరొకరు గొడవపడే పరిస్థితి మాత్రం రాలేదని చెప్పుకొచ్చాడు. ఆ భగవంతుడు ఎవరినైనా భూమిపైకి పంపిస్తే వారిని ఖాళీ కడుపుతో పడుకుకోండా చూస్తాడని విశ్వసిస్తానన్నాడు. అయితే, ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించేందుకు అతడు పనిచేసే చోట వేతనానికి బదులుగా తిండి గింజలు తీసుకుంటాడట. మహ్మద్‌ షరీఫ్‌కు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు తెలియవు గానీ.. పిల్లలు దేవుడిచ్చిన వరమని విశ్వసిస్తాడు. ఇంకా పిల్లలు ఉంటే సంతోషిస్తానని చెప్పుకొస్తున్నాడు. ఇటీవలే అతడు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద తన ముగ్గురు భార్యలకు మూడు ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.