
తాజా వార్తలు
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితిసింగ్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ కేటగిరి భద్రతను కల్పించింది. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు యూపీ ప్రభుత్వం 36 గంటల ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. కానీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఈ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించాయి. అయినప్పటికీ కాంగ్రెస్ రాయ్‌బరేలీ ఎమ్మెల్యే అదితిసింగ్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ’కేవలం రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చించేందుకు మాత్రమే హాజరయ్యాను. అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు పార్టీల సంబంధం లేదు. అయినా నేను సమావేశాలకు వెళ్లినందుకు పార్టీ నాపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటాను. కానీ, నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే నా ప్రథమ కర్తవ్యం’ అని చెప్పారు. ఇదే కాకుండా కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ లోక్‌సభ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అదితి గతంలోనూ పార్టీలకు అతీతంగా జమ్మూకశ్మీర్‌పై భాజపా తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో యోగి ప్రభుత్వం ఆమెకు భద్రతను కల్పించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఆమె తనకు భద్రత కల్పించాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ప్రభుత్వం వై ప్లస్ భద్రతా బలగాలను ఆమె ఇంటికి పంపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ చీఫ్ అఖిలేష్‌యాదవ్‌కు జెడ్ కేటగిరి భద్రతను తొలగించింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- తెలుగువాళ్లందరికీ నేను వెంకీ మామనే: వెంకటేష్
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ‘నీ నుంచి నన్నెవరూ దూరం చేయలేరు మామ’
- వాట్సప్‌లో కాల్ వెయిటింగ్ ఫీచర్
- అలా స్టేటస్లు పెట్టుకోవడం చూసి బాధపడ్డా
- శోభన్‌బాబుగా విజయ్ దేవరకొండ..?
- ‘అతినిద్ర లక్షణాలు ఇవే’..!
- ఎన్టీఆర్ తీరని కోరిక!
- గతం గతః అంటున్న రాహుల్.. శ్రీముఖి
- వెంకీ డైలాగ్: రాశీ-పాయల్ టిక్‌టాక్..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
