close

తాజా వార్తలు

ఇమ్రాన్‌కు సెహ్వాగ్‌ దిమ్మదిరిగే కౌంటర్‌

దిల్లీ: ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో భారత్‌పై విషం చిమ్మిన పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. తనని తాను అవమానించుకునేందుకు ఇమ్రాన్ కొత్త మార్గాల్ని అన్వేషించుకున్నాడంటూ ఇమ్రాన్‌పై ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అమెరికాకు చెందిన ఓ వార్తా ఛానెల్‌లో ఇమ్రాన్‌ మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేశాడు. ఐరాస సర్వప్రతినిధి సభలో ఇమ్రాన్‌ చేసిన ప్రసంగాన్ని అనవసరపు రాద్ధాంతం అని అర్థం వచ్చేలా యాంకర్‌ చేసిన అవమానకర వ్యాఖ్యని గుర్తుచేశారు. సెహ్వాగ్‌ వ్యాఖ్యలకి మాజీ కెప్టెన్ గంగూలీ సైతం మద్దతిచ్చాడు. ఐరాసలో ఇమ్రాన్‌ ప్రసంగం చాలా పేలవంగా ఉందన్నాడు. శాంతి కోరుకోవాల్సిన దేశమే ఇలాంటి అనవసరపు రాద్ధాంతం చేయడమేంటని ప్రశ్నించారు. క్రికెట్‌ ప్రపంచానికి తెలిసిన ఇమ్రాన్‌ ఖాన్‌ ఈయన కాదని వ్యాఖ్యానించాడు. 

గత నెల 26న జరిగిన ఐరాస సాధారణ సభ 74వ సమావేశాల వేదికగా భారత అంతర్గత విషయమైన ఆర్టికల్‌ 370 రద్దును ప్రస్తావించిన ఇమ్రాన్‌.. ఓ అంతర్జాతీయ వేదికపై రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామోఫోబియా పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. భారత్‌ తీసుకున్న నిర్ణయంతో కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు పెరిగిపోయే అవకాశం ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయంటూ హెచ్చరించే యత్నం చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యలపై క్రికెటర్లు మహ్మద్‌ షమీ, హర్భజన్‌ సింగ్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ కూడా ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్‌ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని, ఇటువంటి మాటలు ఇమ్రాన్‌కు తగవని హితవు పలికారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.