close

తాజా వార్తలు

ఇమ్రాన్‌ జిహాద్‌ పిలుపుపై భారత్‌ ఆగ్రహం

ఆయనది అసాధారణ ప్రవర్తనన్న రవీష్‌

దిల్లీ: బాహాటంగానే జిహాద్‌కు పిలుపునిచ్చిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీరుపై భారత్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. అమెరికా పర్యటన ముగించుకొని పాక్‌కు చేరుకున్న అనంతరం భారత్‌కు వ్యతిరేకంగా జిహాద్‌కు బాహాటంగా పిలుపునివ్వడంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ పొరుగు దేశంలా ప్రవర్తించడంలేదనీ.. జిహాద్‌లకు ఇమ్రాన్‌ బహిరంగంగా పిలుపునివ్వడం అత్యంత హేయమన్నారు. అంతర్జాతీయ సంబంధాలు ఎలా నిర్వహించాలో ఇమ్రాన్‌కు తెలియదనీ.. అందుకే ఆయన ఐరాస సర్వసభ్య సమావేశంలో కూడా బాధ్యతారాహిత్యంతో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

‘‘ఐరాస సర్వసభ్య సమావేశంలో ఇమ్రాన్‌ బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆయనకు అంతర్జాతీయ సంబంధాలు ఎలా నెరపాలో తెలియదనుకుంటా’’ అని రవీశ్‌ అన్నారు. అలాగే,  జిహాద్‌లకు బహిరంగంగా పిలుపునివ్వడం అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు.

కశ్మీరీ ప్రజల పక్షాన నిలబడిన వారు జిహాద్‌ చేస్తున్నారని, ప్రపంచం వారిని పట్టించుకోకపోయినా పాకిస్థాన్‌ మాత్రం కశ్మీరీలకు బాసటగా నిలుస్తుందని ఇమ్రాన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తాము జిహాదీలకు మద్దతిస్తామని, అల్లా సంతోషంగా ఉండేదుకు తాము ఇలా చేస్తున్నామని ఇమ్రాన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రవీష్‌.. బాహాటంగా జిహాద్‌కు పిలుపు ఇవ్వడం ఇమ్రాన్‌ అసాధారణ ప్రవర్తనకు నిదర్శనమన్నారు.  

ఇంకోసారి అలా మాట్లాడకండి
కశ్మీర్‌ అంశాన్ని ఐరాస సమావేశంలో లేవనెత్తిన మలేషియా, టర్కీ దేశాలకు సైతం రవీష్‌ కుమార్‌ గట్టి సందేశం ఇచ్చారు. పాకిస్థాన్‌ అక్రమంగా కశ్మీర్‌లోని పలు ప్రాంతాలను ఆక్రమించిందన్నారు. భారత్‌తో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకొని మలేషియా వ్యవహరించాలని సూచించారు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్నారు. అలాగే, టర్కీ కూడా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని మున్ముందు వ్యవహరించాలని సూచించారు. కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమేనని మరోసారి స్పష్టంచేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.