close

తాజా వార్తలు

వాహనాలు వెళ్తుండగానే కూలిన వంతెన

జూనాగఢ్‌: గుజరాత్‌లోని జూనాగఢ్‌లో అందరూ చూస్తుండగానే ఓ నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. కార్లు, ఇతర వాహనాలు రోడ్డుమీద ప్రయాణిస్తుండగానే ఒక్కసారిగా నేల కూలింది. దీంతో ప్రయాణికుల హాహాకారాలు మిన్నంటాయి. సుమారు 60 అడుగుల ఎత్తున్న ఈ వంతెన కూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఓ కారు నదిలో పడే స్థితిలో ఉండగా అందులో ఉన్న ప్రయాణికులు బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అక్కడే ఉన్న స్థానికులు రక్షించే వీలు లేకపోవడంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. జూనాగఢ్‌ సమీపంలోని మలంక గ్రామ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్దిరోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో వంతెన కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈఘటనలో గాయపడిన 14 మందిని సమీప ఆసుప్రతికి తరలించామని పేర్కొన్నారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.