close

తాజా వార్తలు

ఫాల్‌ ప్రవేశాలకుసిద్ధమేనా?

విదేశీ విద్య అమెరికా

అమెరికా విశ్వవిద్యాలయాల్లో వివిధ కోర్సుల్లోకి ప్రవేశాలు ఫాల్‌ సీజన్‌లో ఎక్కువగా జరుగుతాయి. మన విద్యార్థులకు అనువైన తరుణమూ ఇదే. రాబోయే విద్యా సంవత్సరానికి కోర్సుల్లో చేరాలంటే ఇప్పుడే ప్రయత్నాలు ప్రారంభించాలి. ఫాల్‌ సీజన్‌ ప్రవేశ దరఖాస్తులకు గడువు దగ్గరపడుతోంది. ఎక్కువ సంస్థలు డిసెంబరు/ జనవరి వరకు అవకాశాలు కల్పిస్తాయి. వచ్చే ఆగస్టు/ సెప్టెంబరులో తరగతులు మొదలవుతాయి. వాటిని అందుకోవాలంటే ఇప్పటి నుంచే సిద్ధం కావాలి.

నదేశంలో యూజీ, పీజీ కోర్సుల్లో రెగ్యులర్‌ విద్యావిధానంలో ఏడాదికి ఒకసారే (ఒకే సీజన్‌లో) ప్రవేశాలు ఉంటాయి. చేరికలు సాధారణంగా ఆయా సంస్థలను బట్టి జులై/ ఆగస్టులో ఎక్కువగా జరుగుతాయి. యూఎస్‌లో మాత్రం ఇందుకు భిన్నం. ఇక్కడ ఏటా స్ప్రింగ్‌, ఫాల్‌, సమ్మర్‌ అనే మూడు సీజన్లలో అడ్మిషన్లు నిర్వహిస్తారు. పరిమిత సంఖ్యలో సంస్థలు కొన్ని కోర్సులకు వింటర్‌ ప్రవేశాలను కల్పిస్తున్నాయి. అందువల్ల ఏడాది పొడవునా అభ్యర్థులు తమ వీలును బట్టి కోర్సుల్లో చేరవచ్ఛు భారతీయ విద్యార్థులకు ఫాల్‌ సీజన్‌ అనుకూలమైనది.

యూఎస్‌లో ఆగస్టు చివర/ సెప్టెంబరు నుంచి ఫాల్‌ సీజన్‌ మొదలవుతుంది. మన దగ్గర ఏప్రిల్‌/ మేల్లో విద్యాసంవత్సరం ముగుస్తుంది. అందువల్ల సమయం వృథా కాకుండా ఫాల్‌ సీజన్‌ ప్రవేశాల్లో చేరిపోవచ్ఛు ఇందుకు ఏడాది ముందు నుంచే సరైన సన్నద్ధత అవసరం. ఫాల్‌ సీజన్‌లో అన్ని కోర్సులూ అందుబాటులో ఉంటాయి. ఎక్కువ స్కాలర్‌షిప్పులు పొందడానికీ అవకాశం ఉంటుంది. దీని తర్వాత అనువైనది- స్ప్రింగ్‌ సీజన్‌. జనవరి/ ఫిబ్రవరిలో తరగతులు మొదలవుతాయి. సమ్మర్‌లో ఎక్కువ స్పెషల్‌ ప్రోగ్రామ్‌లు ఉంటాయి. సెమిస్టర్ల వ్యవధి తక్కువ. సీజన్లవారీ కోర్సులు మారతాయి. విద్యాసంస్థలు కోర్సులన్నీ ఒకే సీజన్‌లో అందించవు. అమెరికాలో చదువుల కోసం ప్రయత్నాలు ప్రారంభించే ముందు అక్కడి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు అవసరమైన పరీక్షల స్కోరు, ఫీజు వివరాలు, స్కాలర్‌షిప్‌ అవకాశాలు, వసతి ఖర్చులు... తదితరాల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.

జీఆర్‌ఈ స్కోరు ఒక్కటే సరిపోతుందా?

మెరికాలో చదువులకు మొదటి అర్హత గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (జీఆర్‌ఈ). ఇందులో సాధించిన స్కోరు ఆధారంగా అడ్మిషన్‌ ప్రక్రియ మొదలవుతుంది. జీఆర్‌ఈలో ఎక్కువ స్కోర్‌ సాధించినంత మాత్రాన ప్రముఖ సంస్థలో సీటు ఖాయమైనట్లు భావించడానికి లేదు. అకడమిక్‌ సీజీపీఏ (గ్రేడ్‌/పర్సంటేజీ), స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ), రికమెండేషన్‌ లెటర్లు, కరిక్యులమ్‌ వీటే, ఇంటర్న్‌షిప్‌లు, పని అనుభవం (ఉన్నట్లయితే)...తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రవేశం ఖరారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో.. ఒక సంస్థలో, ఒక కోర్సులో 320 జీఆర్‌ఈ స్కోర్‌ సాధించిన అభ్యర్థికి కాకుండా, 315 స్కోర్‌ పొందిన వారికి ప్రవేశం ఖాయం కావచ్ఛు అందుకే ఆ స్కోరు ఒక్కటే ప్రామాణికం కాదు. మెరుగైన జీఆర్‌ఈ స్కోరు... ప్రవేశానికి ప్రధానంగా సాయపడుతుంది. 321-340 మధ్య స్కోరు ఉంటే యూఎస్‌లోని అత్యుత్తమ సంస్థల్లో సీటు వచ్చే అవకాశాలు ఎక్కువ. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎక్కువ మంది విద్యార్థులు 300-320 స్కోరు సాధిస్తున్నారు. ఇది పేరున్న సంస్థల్లో సీటుకు సరిపోతుంది.

ఎంత స్కోరుకు ఎక్కడ సీటు?

విద్యార్థులు జీఆర్‌ఈ స్కోరు ప్రకారం సీటు రావడానికి అవకాశం ఉన్న విశ్వవిద్యాలయాలేమిటో ప్రాథమికంగా తెలుసుకోవాలి. గత కొన్నేళ్ల ప్రవేశాల ఆధారంగా రూపొందించిన జాబితా ఇందుకు ఉపయోగపడుతుంది.

316-320 మధ్య స్కోరు ఉంటే: న్యూయార్క్‌ యూనివర్సిటీ, యూసీ డావిస్‌, సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీ, పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ, నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీ, ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ, మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, సనీ స్టోనీ బ్రూక్‌, బోస్టన్‌ యూనివర్సిటీ, వండర్‌ బిల్ట్‌ యూనివర్సిటీ, వర్జీనియా టెక్‌, యూసీ శాంటా బర్బరా, సిన్సినాటి యూనివర్సిటీ, ఉతాహ్‌ యూనివర్సిటీ, మిస్సోరీ యూనివర్సిటీ, చాపెల్‌ హిల్‌, లోవా స్టేట్‌ యూనివర్సిటీ.

311- 315: ఆరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ, రోచెస్టర్‌ యూనివర్సిటీ, సౌత్‌ కరోలినా యూనివర్సిటీ, ఇండియానా యూనివర్సిటీ-బ్లూమింగ్‌టన్‌, కొలరాడో బౌల్డర్‌ యూనివర్సిటీ, శాన్‌ జోష్‌ స్టేట్‌ యూనివర్సిటీ, సైరా క్యూజ్‌ యూనివర్సిటీ, సనీ బఫెలో, ఫ్లోరిడా యూనివర్సిటీ, యూటీ దల్లాస్‌, జార్జ్‌ మాసన్‌ యూనివర్సిటీ, ఇలినాయిస్‌ యూనివర్సిటీ-షికాగో, యూఎన్‌సీ-చార్లొట్టే, యూసీ రివర్‌ సైడ్‌, క్లెమ్సన్‌ యూనివర్సిటీ, డెలావేర్‌ యూనివర్సిటీ, లోవా యూనివర్సిటీ, జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ, వాషింగ్‌టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, మిసిసిపి స్టేట్‌ యూనివర్సిటీ, జార్జ్‌ వాషింగ్‌టన్‌ యూనివర్సిటీ, లెహిగ్‌ యూనివర్సిటీ.

306-310: అలబామా-హంట్స్‌విల్లే, లూసియానా-లాఫాయెట్టే, ఇలినాయిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీ, యూటీ ఆర్లింగ్‌టన్‌, సెంట్రల్‌ ఫ్లోరిడా యూనివర్సిటీ, టెక్సాస్‌ టెక్‌ యూనివర్సిటీ, మిస్సోరీ స్టేట్‌ యూనివర్సిటీ, వేనే స్టేట్‌ యూనివర్సిటీ, నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీ, సనీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, టెన్నెస్సీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఒక్లహోమా, కన్సాస్‌ స్టేట్‌ యూనివర్సిటీ, వెస్ట్‌ వర్జీనియా యూనివర్సిటీ, ఓరెగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ నెవడా, ఒక్లహోమా స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కనెక్టికట్‌.

301-305: సనీ బింగమ్‌టన్‌, సదరన్‌ మెథడిస్ట్‌, స్టీవెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నెబ్రాస్కా యూనివర్సిటీ, న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, టంపా యూనివర్సిటీ, హోస్టన్‌ యూనివర్సిటీ, కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీ, రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, లూసియానా స్టేట్‌ యూనివర్సిటీ, అబర్న్‌ యూనివర్సిటీ, కెంటకీ యూనివర్సిటీ, కన్సాస్‌ యూనివర్సిటీ, నార్త్‌ డకోటా స్టేట్‌ యూనివర్సిటీ, డ్రెక్సెల్‌ యూనివర్సిటీ, ఆర్కాన్సాస్‌ యూనివర్సిటీ, డేటన్‌ యూనివర్సిటీ, న్యూమెక్సికో యూనివర్సిటీ, విల్లనోవా యూనివర్సిటీ, రైట్‌ స్టేట్‌ యూనివర్సిటీ.

296-300: శాన్‌ డియాగో స్టేట్‌ యూనివర్సిటీ, కెంట్‌ స్టేట్‌ యూనివర్సిటీ, నార్తర్న్‌ ఇలినాయిస్‌ యూనివర్సిటీ, విచితా స్టేట్‌ యూనివర్సిటీ, వెస్టర్న్‌ కెంటకీ యూనివర్సిటీ, సెంట్రల్‌ మిచిగాన్‌ యూనివర్సిటీ, క్లీవ్‌ల్యాండ్‌ స్టేట్‌ యూనివర్సిటీ, కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీ శాక్రమెంటో, మొంటనా స్టేట్‌ యూనివర్సిటీ, యూటీ టైలర్‌, బాల్‌ స్టేట్‌ యూనివర్సిటీ, న్యూయార్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ డెన్వర్‌, ఈస్టర్న్‌ మిచిగాన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఆర్కన్సాస్‌.

యూఎస్‌ ప్రత్యేకతలు ఏమిటి?

వివిధ సంస్థలు ప్రకటించిన ప్రపంచ ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో 150కి పైగా సంస్థలు అమెరికాలోనే ఉన్నాయి. అందువల్ల యూఎస్‌ డిగ్రీలకు విశ్వవ్యాప్త ఆదరణ లభిస్తోంది. పరిశ్రమ వర్గాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇక్కడ చదువుకున్నవారికి ప్రపంచ పోకడలపై అవగాహన పెరుగుతుంది. విశ్వ పౌరుడిగా పరిణతి చెందడానికి వీలుంటుంది. ఈ విద్యా సంస్థల్లో సెల్ఫ్‌ స్టడీ, గ్రూప్‌ వర్క్‌లకు ప్రాధాన్యం ఎక్కువ. దీంతో మన గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

అమెరికాలో ఫీజులు భారీస్థాయిలో ఉన్నప్పటికీ కోర్సు అనంతరం పెద్ద మొత్తంలో వేతనాలతో అవకాశాలను అందుకోవచ్ఛు ఎంఎస్‌ కోర్సులకు సంస్థను బట్టి సగటున 20,000 - 40,000 యూఎస్‌ డాలర్ల ఫీజు ఉంటుంది. ఫీజు, వసతి, భోజనం అన్నీ కలిపి రెండేళ్ల కోర్సు పూర్తి కావడానికి రూ. 45 లక్షల నుంచి రూ. 85 లక్షల వరకు అవసరమవుతాయి. ఆయా ప్రాంతాలను బట్టి ఖర్చుల్లో వ్యత్యాసాలు ఉంటాయి. స్కాలర్‌షిప్పుల ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్ఛు.

అమెరికాలోని టాప్‌-60 విద్యా సంస్థల్లో ఫాల్‌ ప్రవేశాల దరఖాస్తులకు చివరి తేదీ, అవసరమైన జీఆర్‌ఈ స్కోర్‌, యూనివర్సిటీల వారీగా ట్యూషన్‌ ఫీజులు, స్కాలర్‌షిప్‌ అవకాశాలు, ఖర్చుల వివరాలకు https://t.ly/rB27x లింక్‌ లేదా www.eenadupratibha.net చూడవచ్ఛు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.