
తాజా వార్తలు
దిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో లోపాలు సరిదిద్దేందుకు ఆర్థిక నిపుణులు సలహాలు ఇవ్వాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ప్రస్తుత జీఎస్టీ పన్ను విధానంలో కొన్ని లోపాలు ఉండొచ్చని.. అందుకు ఆ విధానాన్ని దూషించడం సరికాదన్నారు. లోపాలు సరిచేసేందుకు సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. పరిశ్రమ వర్గాలు, పలువురు ఆర్థిక రంగ నిపుణులతో పుణెలో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కొంత మంది జీఎస్టీ విధానాన్ని విమర్శిస్తూ సీతారామన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల శాసనసభల్లో బిల్లు ఆమోదం పొందిన జీఎస్టీ విధానాన్ని తప్పుబట్టడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. పూర్తిగా వ్యతిరేకించడం తగదన్నారు. మెరుగైన విధాన రూపకల్పనకు సలహాలు, సూచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొంత మంది నిపుణులు ఇచ్చిన సలహాలను స్వీకరించారు. ఆర్థిక శాఖతో సమగ్రంగా చర్చించేందుకు నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు జీఎస్టీ వసూళ్ల క్షీణతపై స్పందిస్తూ.. కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి విపత్తుల కారణంగా వసూళ్లు తగ్గాయని వివరించారు. అలాగే జీఎస్టీ వసూళ్ల తగ్గుదలకు గల కారణాలను కనుగొనడానికి ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
