close

తాజా వార్తలు

అయోధ్యలో సెక్షన్‌ 144 విధింపు

దిల్లీ: ‘రామజన్మభూమి-బాబ్రీమసీదు’ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ తుది దశకు చేరుకుంది. వారం రోజుల దసరా సెలవుల అనంతరం సోమవారం 38వ రోజు ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్థానం తిరిగి విచారణ ప్రారంభించనుంది. మధ్యవర్తిత్వం విఫలమైన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ​రంజన్​ గొగొయి ​నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఆగస్టు 6నుంచి ఈ కేసుపై రోజువారీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నెల ​17తో దీనిపై వాదనలు ముగియనున్నాయి. సోమవారంతో ముస్లిం వర్గాల వాదనలు పూర్తవనుండగా.. ఈ నెల 16తో హిందూ వర్గాల వాదనలు ముగించాలని ధర్మాసనం సూచించింది. నవంబర్‌ 17న దీనిపై తీర్పు వెలువరించనున్నారు. అదే రోజు రంజన్‌ గొగొయి పదవీ విరమణ పొందనుండడం గమనార్హం. అతి సున్నితమైన ఈ కేసులో సుప్రీం విచారణ ముగుస్తుండటం..త్వరలో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆదివారం అయోధ్యలో 144 సెక్షన్​ విధించారు. డిసెంబర్​ 10వరకు ఆంక్షలు కొనసాగుతాయని జిల్లా మెజిస్ట్రేట్​ అనూజ్ కుమార్​ తెలిపారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.