close

తాజా వార్తలు

అలాంటి దేశాల్ని ఏకాకి చేయాలి:ఉపరాష్ట్రపతి

ఫ్రీటౌన్‌: ఉగ్రవాదానికి అండగా నిలుస్తోన్న దేశాల్ని ఏకాకి చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఉగ్రవాదమే అతిపెద్దదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్రికా దేశం సియెర్రా లియోన్‌ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నందుకు ఆ దేశ అధ్యక్షుడు జులియస్‌ మాడా బయోకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అత్యధిక జనాభా కలిగిన ఆఫ్రికా దేశాలతోపాటు భారత్‌కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తగు ప్రాధాన్యం కల్పించేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆయన అక్కడి ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడారు. సియెర్రా లియోన్‌, భారత్‌ మధ్య సంబంధాలకు ప్రవాస భారతీయులు వారధిగా నిలిచారన్నారు. అలాగే వారి సంక్షేమం కోసం అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జులియస్‌ మాడా బయోకు ఉపరాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు.

వ్యవసాయం, ఆహార శుద్ధి, సమాచార సాంకేతిక రంగాల్లో భారత్‌, సియెర్రా లియోన్‌ మధ్య పరస్పర సహకారం మరింత పెరిగేలా బంధాన్ని బలోపేతం చేసుకోవాలని వెంకయ్యనాయుడు, జులియస్‌ మాడా బయో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం కోసం సియెర్రా లియోన్‌కు రూ.212 కోట్ల రుణ వెసులుబాటు(క్రెడిట్‌ లైన్‌) కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సుహృద్భావ సూచికగా సియెర్రా లియోన్‌కు 1000 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపించాలని భారత్‌ నిర్ణయించింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.