close

తాజా వార్తలు

భారత్‌లో ‘ఆకలి రాజ్యం’

ఆకలి సూచిలో పాకిస్థాన్‌ కంటే వెనకే

దిల్లీ: ప్రపంచ ధాన్యాగారాల్లో ఒకటిగా పరిగణిస్తున్న భారత్‌లో ఆకలి సమస్య తాండవమాడుతోంది. ప్రపంచ ఆకలి సూచి(జీహెచ్‌ఐ)లో మన స్థానం 102. పాకిస్థాన్‌ ఈ విషయంలో దాదాపు 8 స్థానాలు మెరుగు పడి ఉంది. జీహెచ్‌ఐ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 117 దేశాలను తీసుకుని చేసిన సర్వేలో భారత్‌లో 102వ స్థానంలో నిలవగా.. పాకిస్థాన్‌(94), బంగ్లాదేశ్‌(88), శ్రీలంక (66) స్థానాలతో భారత్‌ కంటే ముందంజలో ఉన్నాయి. వెల్త్‌హంగర్‌హైలైఫ్‌ సంస్థ ఈ నివేదికను విడుదల చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసింది. ఆకలి సమస్యలతో తీవ్రంగా సతమతమవుతున్న 45 దేశాల్లో భారత్‌ కూడా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. 

భారత్‌లో కేవలం 6 నుంచి 23 నెలల వయసున్న 9.6శాతం మంది చిన్నారులు మాత్రమే సరిపడా ఆహారాన్ని తీసుకోగలుగుతున్నారు. 2015-16లో 90శాతం భారతీయులు పరిశుభ్రమైన తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. 39 శాతం భారతీయులకు సరిపడా పారిశుద్ధ్య సౌకర్యాలు లేవు. ఇక ఆకలి సమస్యను నియంత్రించడానికి బంగ్లాదేశ్, నేపాల్‌ చేస్తున్న కృషిపై ఈ నివేదిక హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యంగా చిన్నారులకు పోషకాహారం అందిచడంలో ఆ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఆదర్శనీయమని కొనియాడింది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.