close

తాజా వార్తలు

చిదంబరం అరెస్టు

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం అరెస్టు చేసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆయన ప్రస్తుతం తిహార్‌ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయాన్నే ముగ్గురు ఈడీ అధికారులు జైలుకు చేరుకొని దాదాపు గంటపాటు ఆయన్ను ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేశారు. 

ఐఎన్ఎక్స్‌ మీడియా కేసులో 55రోజుల సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీ తర్వాత చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయనను అరెస్టు చేసేందుకు ఈడీ అధికారులకు ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. నగదు అక్రమ చలామణి అంశంపై ప్రశ్నించేందుకు ఈడీకి అనుమతినిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి అజయ్‌ కుమార్‌ కుహార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.